అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nayanthara Divorce | చిత్రసీమలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న నయనతార (Nayanthara), తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తన అద్భుతమైన నటనతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఈ అమ్మడికి తమిళ సినిమాల్లో (Tamil movies) ఉన్న క్రేజ్ ప్రత్యేకమైనది. అక్కడ ఆమెకు స్టార్ హీరోలతో సమానమైన పాపులారిటీ ఉంది. విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) అనే దర్శకుడిని ప్రేమించి వివాహం చేసుకున్న నయనతార అంతకముందు శింబు, ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపింది. చివరికి విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, పెళ్లి తర్వాత నయనతార జీవితం అంత సాఫీగా సాగలేదని చెప్పవచ్చు.
Nayanthara Divorce | విడాకుల బాట..
వివాహం తరువాత నయనతార వివాదాలలో చిక్కుకుంది. ఆమె సరోగసి ద్వారా పిల్లలు కనడం సంచలనంగా మారింది. ఆమె చేసిన హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని కొందరు కోర్టులో Court కేసులు పెట్టారు. మరోవైపు, ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి (astrologer Venu Swamy) నయనతార తన పెళ్లి తర్వాత విడాకులు తీసుకుంటుందని గతంలో చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో నయనతార తన సోషల్ మీడియాలో (Social Media) ఓ ఆసక్తికర పోస్ట్‌ను షేర్ చేసి, వైవాహిక జీవితం గురించి కొన్ని కామెంట్లు చేసింది.తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు మ్యారేజ్ అనేది పెద్ద మిస్టేక్. నీ భర్త చేసే ఏ పనులకైనా కూడా నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పురుషులు సాధారణంగా మెచ్యూర్ కాదు. నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను ఆల్రెడీ చాలా ఫేస్ చేశా మీవల్ల అంటూ నయనతార (Nayanthara) రాసుకొచ్చింది.
ఇది ఎవరికీ ఉద్దేశించి చేసిన పోస్ట్ అనేది మాత్రం ఆమె స్పష్టం చేయలేదు. అయితే, నయనతార ఈ పోస్ట్‌ను కొన్ని గంటల్లోనే డిలీట్ చేయడంతో, నెటిజన్లు ఆమె భర్త విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) నుంచి విడాకులు (Divorce) తీసుకోబోతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు తీసుకోవడం ఏంటని కొందరు ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2022లో నయనతార, విఘ్నేష్ శివన్ (Nayanthara and Vignesh Shivan) పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరూ 7 సంవత్సరాల పాటు ప్రేమ బంధంలో ఉన్నారు. ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం విడాకులపై వచ్చిన పుకార్లు నిజమేనా, లేదా కేవలం నెటిజన్ల ఊహాగానాలేనా అనేది చూడాలి.