అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pahalgaon terrorist attack : ఇటీవలే వివాహం అయిన నవజంట నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ దంపతులు హనీమూన్ కోసం పహల్గావ్ వెళ్లారు. ఈ తరుణంలోనే ఆయన ఉగ్రమూకల పాశవిక దాడికి బలి అయ్యారు. కాగా, ఉగ్రదాడికి ముందు నవజంట నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ దంపతులు పహల్గావ్లో సరదాగా రీల్ చేశారు. కశ్మీర్ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఓ పాటకు డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ రీల్ నెట్టింట వైరల్ అవుతోంది.
కాగా, నెటిజన్లు వినయ్ నర్వాల్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రీల్ కాద..రియల్ హీరో అంటూ కొనియాడుతున్నారు. ఉగ్రదాడి వేళ.. తన ప్రాణాలను పణంగా పెట్టి, టూరిస్టులను కాపాడిన హీరోగా పొగుడుతున్నారు. తుపాకీ గుండ్ల వర్షం కురుస్తున్నా.. గాయపడ్డ పర్యాటకుడ్ని భుజాన ఎత్తుకొని మరీ పరుగులు తీసిన వినయ్‌ను మెచ్చుకుంటున్నారు. మతం కాదు మానవత్వమే ముఖ్యమని.. ప్రాణాలను లెక్క చేయకుండా కాపాడిన హీరోగా అభివర్ణిస్తున్నారు.
ఉగ్రదాడికి ముందు నవజంట నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ దంపతులు పహల్గావ్లో సరదాగా రీల్ చేశారు. ప్రస్తుతం ఈ రీల్ నెట్టింట వైరల్ అవుతోంది.#PahalgamTerroristAttack #Pahalgam #pahalgamattack #PahalgamTerrorAttack #naviofficer pic.twitter.com/1Tth9bLtRP
— Akshara Today (@aksharatoday) April 23, 2025