అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Local Body Elections | రాష్ట్రానికి జాతీయ నేతలు క్యూ కడుతున్నారు. వరుస పర్యటనలు చేపడుతున్నారు. రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections ) జరగనున్నాయి. దీంతో కాంగ్రెస్(Congress), బీజేపీ (BJP) జాతీయస్థాయి నేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) నిజామాబాద్ నగరానికి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. కేంద్రం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శుక్రవారం హైదరాబాద్ రానున్నారు. శిల్పకళావేదికలో జరిగే అల్లూరి జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. ఇప్పటికే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్న బీజేపీలో జాతీయ నేతలు జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు.
Local Body Elections | హైదరాబాద్ చేరుకున్న ఖర్గే
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) గురువారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘన స్వాగతం పలికారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్లో నేతలతో సమావేశం కానున్నారు. అనంతరం ఎల్బీ స్టేడియం (LB Stadium) లో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. స్థానిక ఎన్నికలపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు కార్యకర్తలు ప్రజలు నెలలుగా నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల హైకోర్టు (High Court) సెప్టెంబర్ 30లోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలో ఆయా పార్టీల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించాయి.