Namo Bharat | నమో భారత్‌.. రైలు ప్రత్యేకతలు ఇవే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Namo Bharat | వందేభారత్‌ Vande Bharat రైళ్లతో ఇప్పటికే ఇండియన్‌ రైల్వే రికార్డు సృష్టించింది. తాజాగా అదనపు బోగీలతో నమో భారత్‌ రాపిడ్‌ రైలును Rapid train namo bharat అందుబాటులోకి తెస్తోంది. దేశంలో తొలిసారి 16 బోగిలతో ఈ రైలు పట్టాలెక్కబోతోంది. ఈనెల ప్రధాని నరేంద్ర మోదీ pm modi చేతులమీదుగా ఈ రైలు సేవలను ప్రారంభించనున్నారు.

దేశంలోనే మొదటి నమోభారత్‌ Namo Bharat రైలు గతేడాదిలో అహ్మదాబాద్‌–భుజ్‌ స్టేషన్ల Ahmedabad-Bhuj stations మధ్య ప్రారంభమైంది. అయితే అందులో కేవలం 12 కోచ్‌లు మాత్రమే అందుబాటులో ఉండేవి. దీంతో ప్రయాణికులకు సరిపడా బెర్త్‌లు ఉండేవి కావు. డిమాండ్‌ దృష్ట్యా కోచ్‌ల సంఖ్య పెంచాలని భావించిన రైల్వే శాఖ.. 16 కోచ్‌లతో నమో భారత్‌ రైలుకు శ్రీకారం చుట్టింది.

కాగా.. ఈ రైలు గంటకు 110 కి.మీ. వేగంతో దూసుకెళ్తుంది. ఇందులో అన్నీ కూడా ఏసీ కోచ్‌లు AC coaches ఉంటాయి. మొత్తంగా 2వేల మంది సీటింగ్‌ సామర్థ్యంతో రైలు ప్రయాణిస్తుంది. అదనంగా మరో వెయ్యి మంది ప్రయాణికులు నిల్చుని ప్రయణించేలా సదుపాయాలు ఉంటాయి. ఇందుకోసం అదనంగా సౌకర్యాలు కూడా కల్పించారు. కాగా.. సమయం కూడా తగ్గుతుందని రైల్వే శాఖ ప్రకటించింది.