అక్షరటుడే, వెబ్‌డెస్క్: Konda Surekha | తమ కూతురిలో కూడా రాజకీయ రక్తం (political blood) ప్రవహిస్తోందని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కొండా మురళి, కొండా సురేఖ దంపతుల తీరుతో వరంగల్ కాంగ్రెస్‌లో (Warangal Congress) రాజకీయాలు హీట్ ఎక్కిన విషయం తెలిసిందే. ఇటీవల కొండా దంపతులు వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.
సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే వారు వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని (Warangal district) కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు కొండా దంపతులకు వ్యతిరేకంగా ఏకం అయ్యారు. ఈ మేరకు మీనాక్షి నటరాజన్‌కు (Meenakshi Natarajan) ఫిర్యాదు చేశారు. ఇటీవల కొండా మురళి పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. తాజాగా గురువారం ఉదయం కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌తో భేటీ అయ్యారు.
Konda Surekha | ఆరోపణలపై వివరణ
మీనాక్షి నటరాజన్‌తో (Meenakshi Natarajan) కొండా దంపతులు భేటీ అయి తమపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా కొండా మురళి మాట్లాడుతూ.. మీనాక్షి నటరాజన్‌కు అన్ని వివరించామన్నారు. స్థానిక ఎన్నికల్లో (local elections) ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ (joint Warangal district) అన్ని స్థానాలు గెలుచుకునేలా కృషి చేస్తానని చెప్పారు. రాహుల్‌ను ప్రధాని చేయడమే తమ లక్ష్యమన్నారు.
Konda Surekha | కూతురు రాజకీయ ఎంట్రీపై..
కొండా మురళి తమ కుమార్తె పరకాల నుంచి పోటీ చేస్తుందని గతంలో వ్యాఖ్యానించారు. ఇటీవల ఆయన కుతురు సుష్మిత పటేల్ (Sushmita Patel) సైతం పరకాలలో పోటీ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇప్పటికే అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి (MLA Revuri Prakash Reddy) ఉన్నారు. ప్రకాశ్‌రెడ్డిని తామే గెలిపించామని మురళి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా తమ కూతురు పోటీపై మురళి స్పందించారు. ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. మరోవైపు మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) మాట్లాడుతూ.. తమలో రాజకీయ రక్తం, సేవ గుణం ఉన్నాయని పేర్కొన్నారు. తమ కూతురులో అవే వారసత్వంగా వచ్చాయన్నారు. దీంతో ఆమె పరకాలలో పోటీ చేస్తున్నట్లు చెప్పి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. ఆమె ఆలోచనలను కాదనే అధికారం తమకు లేదన్నారు.