అక్షరటుడే, వెబ్‌డెస్క్: Impeachment Motion | జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలని లోక్‌సభ, రాజ్యసభలో ఎంపీలు నోటీసులు అందజేశారు. జస్టిస్ వర్మ గతంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా (Delhi High Court Judge) పనిచేశారు. గత మార్చి నెలలో ఆయన ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఆర్పడానికి వచ్చిన అగ్ని మాపక సిబ్బంది భారీగా నోట్ల కట్టలు ఆయన ఇంట్లో ఉండటాన్ని గమనించారు. అనంతరం ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.
Impeachment Motion | చర్యలు చేపట్టిన సుప్రీం
జస్టిస్ వర్మ (Justice Verma) ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారం బయటపడడంతో సుప్రీంకోర్టు కొలిజియం ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. అనంతరం విచారణకు కమిటీని వేసింది. ఈ కమిటీ ఆ నోట్ల కట్టలు జస్టిస్ యశ్వంత్ వర్మకు చెందినవిగా తేల్చింది. ఆయనను అభిశంసన ద్వారా తొలగించాలని నివేదిక ఇచ్చింది. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాల (Parliament Sessions) ప్రారంభం సందర్భంగా ఆయనను తొలగించాలని ఎంపీలు అభిశంసన తీర్మానం ఇచ్చారు. ఈ తీర్మానంపై 145 మంది ఎంపీల సంతకాలు చేశారు.
Impeachment Motion | కమిటీ నివేదికపై సవాల్
నోట్ల కట్టల విషయంలో అంతర్గత కమిటీ నివేదికను సవాలు చేస్తూ జస్టిస్ యశ్వంత్ శర్మ సుప్రీంను (Supreme Court) ఆశ్రయించారు. ఈ నివేదికను రద్దు చేయాలని గురువారం ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో తన వాదన వినకుండానే నివేదిక రూపొందించారని ఆయన ఆరోపించారు.
Impeachment Motion | తొలి వ్యక్తి అవుతారా..
దేశంలో ఇప్పటి వరకు అభిశంసన ద్వారా ఏ న్యాయమూర్తిని తొలగించలేదు. న్యాయమూర్తుల అభిశంసన కోసం లోక్‌సభ(Loksabha)లో అయితే 100 మంది, రాజ్యసభ(Rajyasabha)లో 50 మంది సభ్యులు సంతకాలు చేసి నోటీసు అందించాల్సి ఉంటుంది. అనంతరం లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ ఛైర్మన్ తీర్మానాన్ని ఆమోదించాలా లేదా అనే నిర్ణయం తీసుకుంటారు. ఒక వేళ ఆమోదిస్తే కమిటీ ఏర్పాటు చేస్తారు. న్యాయమూర్తిపై వచ్చిన ఆరోపణలపై ఆ కమిటీ విచారణ చేస్తుంది. దోషిగా తేలితే.. నివేదికను పార్లమెంట్లో ప్రవేశ పెడతారు. అనంతరం పార్లమెంట్లో ఓటింగ్ ద్వారా న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానాన్ని ఆమోదిస్తారు. తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో సదరు న్యాయమూర్తిని తొలగిస్తున్నట్లు ప్రకటిస్తారు.
దేశంలో ఇప్పటి వరకు చాలా సార్లు అభిశంసన తీర్మానాలు ప్రవేశపెట్టారు. అయితే ఒక్కరిని కూడా ఈ తీర్మానంతో తొలగించలేదు. గతంలో అక్రమాలకు పాల్పడ్డారని జస్టిస్ వి.రామస్వామిపై 1993లో అభిశంసన పెట్టారు. అయితే కొందరు ఎంపీలు ఓటింగ్కూ దూరంగా ఉండడంతో అది విఫలమైంది. అనంతరం ఆయన పదవీ విరమణ చేశారు. జస్టిస్ సౌమిత్రసేన్పై 2011లో అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టారు. రాజ్యసభలో ఆ తీర్మానాన్ని ఆమోదించారు. లోక్సభలో చర్చ జరగక ముందే ఆయన రాజీనామా చేశారు. ఇప్పటి వరకు ఎవరిని కూడా అభిశంసన ద్వారా తొలగించలేదు. ఇప్పుడు జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగిస్తే ఆయన మొదటి వ్యక్తిగా నిలవనున్నారు.