అక్షరటుడే, వెబ్‌డెస్క్:Unit Mall | ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ పట్నం(Visakhapatnam)లో మరో కీలక నిర్మాణానికి కేంద్రం చేయూత అందించనుంది. చేనేత, హస్తకళలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం యూనిట్ మాల్స్(Unit Malls) మంజూరు చేస్తోంది. ఏపీ(AP)కి మంజూరైన ఈ మాల్‌ను విశాఖపట్నంలోని మధురవాడలో నిర్మించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం(State Government) ఇప్పటికే స్థలాన్ని సేకరించింది. రూ.172 కోట్లతో నాలుగు అంతస్తులతో ఈ మాల్ నిర్మించనున్నారు.
Unit Mall | వడ్డీలేని రుణం
యూనిట్ మాల్(Unit Mall) నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం(Central Government) ఏపీకి వడ్డీ లేని రుణం ఇవ్వనుంది. ఇప్పటికే రూ.86 కోట్లు మంజూరు చేసింది. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. మే 2న అమరావతి(Amaravati)లో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న ప్రధాని మోదీ(Prime Minister Modi) యూనిట్ మాల్‌కు కూడా వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. 2026 మార్చి నాటికి మాల్‌ను అందుబాటులోకి తీసుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం ఇచ్చే రూ.172 కోట్ల రుణాన్ని మాల్ ద్వారా వచ్చే ఆదాయంతో తీర్చనున్నారు.
Unit Mall | ప్రత్యేకతలు ఇవే..
యూనిట్ మాల్‌ను ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. రుషికొండ బీచ్(Rushikonda Beach)కు ఐదు కిలోమీటర్ల దూరంలో సముద్రాన్ని ఆనుకుని దీనిని నిర్మించనున్నారు. ఇందులోని మొదటి, రెండో అంతస్తుల్లో 62 దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు. మూడో అంతస్తు నుంచి సముద్రాన్ని వీక్షించేలా ఏర్పాటు ఉంటుంది. నాలుగో అంతస్తులో కన్వెన్షన్ హాల్(Convention Hall), మినీ థియేటర్లు(Mini Theaters) ఏర్పాటు చేస్తారు.