అక్షరటుడే,ఇందూరు: Ramchander Rao | భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రాంచందర్ రావును మంగళవారం జిల్లా ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta), రాకేష్ రెడ్డి (MLA Rakesh Reddy) కలిశారు. ఆయనను శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాంచందర్‌రావుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడని, పార్టీ శ్రేణులను సమన్వయం చేయడంలో అనుభవం కలిగిన నేత రామచందర్ రావు అని కొనియాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి నాయకత్వంలో అధిక సీట్లు సాధించడం ఖాయమని వారు స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.