ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Parvathipuram Mla | అర్ధ‌రాత్రి మ‌హిళా ఉద్యోగినికి ఫోన్.. బూతు పురాణం అందుకున్న ఎమ్మెల్యే!

    Parvathipuram Mla | అర్ధ‌రాత్రి మ‌హిళా ఉద్యోగినికి ఫోన్.. బూతు పురాణం అందుకున్న ఎమ్మెల్యే!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Parvathipuram Mla | ఇటీవ‌ల బాధ్య‌త‌గా ఉండాల్సిన చాలా మంది నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పార్వతీపురంలో ఎమ్మెల్యే MLA బోనెల విజయచంద్ర వర్సెస్ పార్వతీపురం తహశీల్దార్‌ జయలక్ష్మి వ్యవహారం సంచలనంగా మారింది. తనకు ఎమ్మెల్యే విజయచందర్(MLA Vijayachander) రాత్రి 10:59 నిమిషాలకు ఫోన్ చేసి అసహ్యంగా, అసభ్యకరంగా ఒక మహిళను అని కూడా చూడకుండా దూషించారని తహశీల్దార్ జయలక్ష్మి(Tahsildar Jayalakshmi) పేరుతో రాసి ఉన్న ఓ ఫిర్యాదు కాపీ ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ క్ర‌మంలో ఎమ్మెల్యే విజయచంద్ర ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

    Parvathipuram Mla | ఏంది.. ఈ ర‌చ్చ‌

    తహశీల్దార్​కు తాను ఫోన్ చేసిన మాట వాస్తవమేనని, మధ్యాహ్నం నుండి అనేకసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదని, ఆర్డీవో(RDO)కు కూడా ఫోన్ చేసి చెప్పానని అన్నారు. బోనెల విజయచంద్ర తీవ్రంగా స్పందిస్తూ.. తహసీల్దార్ పెద్ద అవినీతిపరురాలని.. ఆమెకు మతిస్థిమితం లేదని ఆరోపించారు. రెవెన్యూ సర్వీసులో పనిచేయడానికి ఆమె అనర్హురాలని ఎమ్మెల్యే(MLA) విమర్శించారు. తహశీల్దార్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో తాను చాలా సార్లు ఫోన్ చేసినప్పటికీ ఆమె స్పందించలేదన్నారు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోయే సరికి రాత్రి వాట్సప్ కాల్ (Whatsapp Call) చేసిన మాట వాస్తవమని తెలిపారు. తహశీల్దార్‌(Tahsildar)పై రెవెన్యూశాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తానన్నారు. తహశీల్దార్ క్షమాపణలు చెప్పకపోతే ఏం చేయాలో అది చేసి తీరుతానని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర స్పష్టం చేశారు.

    READ ALSO  NTR District | నా చావుకు ఎమ్మెల్యేనే కారణం.. సూసైడ్​ నోట్​ రాసి అదృశ్యమైన ఏఈ

    కాగా.. తహశీల్దార్‌పై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తహశీల్దార్‌కు మతిస్థిమితం లేదంటూ ఎమ్మెల్యే(MLA) వ్యాఖ్యలు చేయడంపట్ల ఉద్యోగ వర్గాల్లో తీవ్రమై అసహనం, వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా ఎమ్మెల్యే, తహశీల్దార్ మధ్య జరుగుతున్న వార్ ఒక్కసారిగా బహిర్గతమవడం చర్చకు దారి తీసింది. ఎమ్మార్వో వ‌ర్సెస్ ఎమ్మెల్యే వివాదంపై ప‌రిష్కారం చూపించాల‌ని రెవెన్యూ ఉద్యోగుల సంఘం(Revenue Employees Association) నాయ‌కులు ప్ర‌భుత్వాన్ని కోరారు. దీంతో జిల్లా మంత్రి గుమ్మిడి సుధారాణి (Sudha Rani)ఈ విష‌యాన్ని ప‌రిశీలించేలా సీఎం చంద్ర‌బాబు(CM Chandrababu) ఆదేశించారు. కాగా.. ఎమ్మెల్యేనే లంచాలు తీసుకుంటున్నార‌ని జ‌య‌ల‌క్ష్మి ఆరోపించ‌డం గ‌మ‌నార్హం.

    Latest articles

    Tirumala | తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం

    అక్షరటుడే, తిరుమల: Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కానీ, కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండాల్సిన అవసరం...

    Today Gold Price | మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. శ్రావణంలో భారీగా పెళ్లిళ్లు.. కొనుగోలు కష్టమేనా..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : ప‌సిడి ధరలు (Gold rates) ప‌రుగులు పెడుతున్నాయి. త‌గ్గినట్టే త‌గ్గి...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 23 జులై​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Kanwar Yatra | కన్వర్​ యాత్రికులపై ఆగని ఆగడాలు..! సుప్రీంకోర్టు జోక్యం.. యూపీ సర్కారు కీలక నిర్ణయం..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kanwar Yatra : కన్వర్​ యాత్ర.. ఏటా శ్రావణ మాసంలో జరిగే ఈ వేడుకలో భక్తులపై...

    More like this

    Tirumala | తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం

    అక్షరటుడే, తిరుమల: Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కానీ, కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండాల్సిన అవసరం...

    Today Gold Price | మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. శ్రావణంలో భారీగా పెళ్లిళ్లు.. కొనుగోలు కష్టమేనా..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : ప‌సిడి ధరలు (Gold rates) ప‌రుగులు పెడుతున్నాయి. త‌గ్గినట్టే త‌గ్గి...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 23 జులై​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...