అక్షరటుడే, వెబ్‌డెస్క్: Padi Kaushik Reddy | ప్రభుత్వ అధికారులకు హుజురాబాద్(Huzurabad) ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (MLA Padi Kaishik Reddy) వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ అధికారులు ఎక్స్‌ట్రాలు చేయకుండా పనులు చేయాలన్నారు. “మీరేం కాంగ్రెస్ కండువా కప్పుకున్న కార్యకర్తలు కాదు” అన్నారు. పేదవాళ్ల జీవితాలతో చెలగాటం ఆడొద్దని, ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తే మంచిది కాదన్నారు. ఇటీవల మంత్రి సీతక్క (Minister seethakka) తీరుతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఆ యువకుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఆ యువకుడు ఆత్మహత్య చేసుకుంటే పోలీసులు వెళ్లి దానిని డిలీట్ చేశారని ఆరోపించారు.
Padi Kaushik Reddy | ఇళ్లు క్యాన్సిల్ చేస్తే ఊరుకోం
హుజూరాబాద్ నియోజకవర్గంలో 40 వేల మందికి ఇందిరమ్మ ఇళ్లకు (Indiramma illu) అర్హత ఉందని కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పిందని కౌశిక్‌రెడ్డి అన్నారు. అయితే కొంత మందికే ప్రోసిడింగ్లు ఇచ్చారని పేర్కొన్నారు. తర్వాత కొందరి ప్రోసిడింగ్లను అధికారులు రద్దు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోసిడింగ్లు ఎందుకు రద్దు చేస్తున్నారని ప్రశ్నించారు. ఏమన్నా ఉంటే తనతో తేల్చుకోవాలని, ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని సవాల్ విసిరారు. ముగ్గు పోసుకున్నాక ప్రోసిడింగ్లు రద్దు చేస్తూ ఊరుకునేది లేదని కౌశిక్‌రెడ్డి హెచ్చరించారు.