అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mithun Reddy | ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు రేపుతున్న లిక్కర్ స్కాం కేసు(Liquor Scam Case)లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచి, ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్‌కి పంపించారు. ఈ క్రమంలో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు(Rajahmundry Central Jail)కు తరలించారు.
ఆరోగ్య పరిస్థితులు, వ్యక్తిగత అవసరాల దృష్ట్యా సదుపాయాలు కల్పించాలని కోరుతూ మిథున్ రెడ్డి(Mithun Reddy) తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు(ACB Court), కొన్ని ప్రత్యేక సౌకర్యాలను అనుమతిస్తూ జైలు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
Mithun Reddy | ప్రత్యేక సదుపాయాలు..
కోర్టు అనుమతించిన ప్రత్యేక సదుపాయాలు(Special Facilities) ఏంటంటే.. వ్యక్తిగత బెడ్, వెస్ట్రన్ టాయిలెట్, టీవీ, దోమ తెర, యోగా మ్యాట్, ఇంటి నుండి వచ్చే భోజనం, ప్రొటీన్ పౌడర్(Protein Powder), రెగ్యులర్ మెడిసిన్(Regular Medicine), వాకింగ్ షూస్, మినరల్ వాటర్(Mineral Water), వార్తాపత్రికలు, నోట్‌బుక్స్, పెన్లు, వారానికి ఐదు రోజులు ఇద్దరు న్యాయవాదులతో ప్రైవేట్‌గా భేటీ, ఒక పర్యవేక్షకుడిని నియమించుకునే వెసులుబాటు.. ఈ సదుపాయాలపై జైలు అధికారులకు అభ్యంతరాలుంటే జులై 23 ఉదయం 10.30 గంటల లోపు కోర్టుకు నివేదిక ఇవ్వాలని, లేదంటే వాటిని అమలు చేయాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ మిథున్ రెడ్డిని ఏ-4 నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేయడాన్ని వైసీపీ ఖండించింది. ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్య అని అభిప్రాయపడింది.
ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శల దృష్టి మళ్లించేందుకు మా నాయకులపై అక్రమ అరెస్టులు చేస్తున్నారు. సూపర్ సిక్స్ (Super Six) పేరుతో అమలు చేస్తున్న పాలన ప్రజల్లో స్పందన పొందకపోవడం వల్లే ఈ చర్యలు తీసుకుంటున్నార అని పార్టీ వర్గాలు మండిపడ్డాయి. మొత్తంగా, లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి అరెస్టు, రిమాండ్, ప్రత్యేక సదుపాయాల చుట్టూ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కినట్లు కనిపిస్తోంది. ఆగస్టు 1న జరగబోయే తదుపరి విచారణతో కేసు మరింత మలుపు తిరగనుంది.