అక్షరటుడే, ఆర్మూర్: Assistant Commandant | ఆలూర్ మండలం మిర్దాపల్లికి చెందిన కర్ణాల రాము అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఇటీవల వెలువడిన గ్రూప్–1 (Group-1 Results) ఫలితాల్లో అసిస్టెంట్ కమాండెంట్ ఆఫ్ పోలీస్(Assistant Commandant of Police) ఉద్యోగం సాధించాడు. దీంతో ఆదివారం ఇషా ఫౌండేషన్(Isha Foundation) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రామును ఘనంగా సన్మానించారు.
Assistant Commandant | డీజీపీ అభినందన
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు డీజీపీ మహేష్ భగవత్(DGP Mahesh Bhagwat) రామును ప్రత్యేకంగా అభినందించారు. తమ గ్రామానికి చెందిన యువకుడు కేంద్రప్రభుత్వ కొలువుకు (Central Government) ఎంపిక కావడంపై గ్రామస్థులు, బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు.