అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Nizamabad City | గంజాయి విక్రయిస్తున్న బాలుడిని(Minor boy) పోలీసులు పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. నాలుగో టౌన్ పోలీసులు (4th Town Police) తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లమ్మగుట్ట (Yellammagutta) వంతెన వద్ద ఓ బాలుడు గంజాయి విక్రయిస్తున్నాడనే సమాచారంతో అతడిని తనిఖీ చేశారు. అతడి వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Nizamabad City | మైనర్ వద్ద గంజాయి లభించడంపై సర్వత్రా విస్మయం
నగరంలో ఓ బాలుడి వద్ద గంజాయి లభించడం సర్వత్రా విస్మయానికి గురిచేస్తోంది. చిన్నారులను పావులుగా వాడుతూ ఏదైనా ముఠా వెనక నుంచి ఈ దందా నడిపిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు గంజాయి విక్రయాలకు సంబంధించి అనేక కేసులు వెలుగులోకి వచ్చినప్పటికీ బాలురతో విక్రయాలు జరిపించడంపై తాజాగా వెలుగులోకి రావడం చర్చకు దారి తీసింది.
Read all the Latest News on Aksharatoday.in