అక్షరటుడే, వెబ్‌డెస్క్: Minister Sridharbabu | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి స్పష్టంగానే ఉందని, ఆ ప్రాజెక్టును అడ్డుకుంటామని మంత్రి శ్రీధరబాబు (Minister Sridharbabu) స్పష్టం చేశారు.
గోదావరిలో తెలంగాణకు రావాల్సిన ఒక్క బొట్టును కూడా వదులుకోమని తేల్చి చెప్పారు. ఈ విషయంలో బీఆర్ ఎస్ గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్ర ప్రాతానికి నీళ్లు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేసిన కేసీఆర్ (KCR) ఈరోజు తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న శ్రీధర్‌బాబు ఈ సందర్భంగా నిర్వహించిన ఇందిరాశక్తి బహిరంగ సభలో మాట్లాడారు.
Minister Sridharbabu | నీటి విషయంలో రాజీ లేదు..
నదీజలాల విషయంలో బీఆర్ ఎస్ రాద్దాంతం చేస్తోందని శ్రీధర్‌బాబు మండిపడ్డారు. నీటి వాటాల విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project)ను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని చెప్పారు. తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటా దక్కిన తర్వాతే మిగతా ప్రాంతానికి వెళ్తాయన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం(Central Government)పై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు.
Minister Sridharbabu | పదేళ్లలో ఏం చేశారో గుర్తు చేసుకోండి..
బీఆర్ఎస్ నేతలపై మంత్రి నిప్పులు చెరిగారు. కాళేశ్వరం సమీపంలోని రైతులకు (Farmers) నీళ్లు ఇవ్వకుండా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారన్నారు. కూలిపోయిన డ్యాముల గురించి ఇవాళ బీఆర్ఎస్ నేతలు గొప్పగా మాట్లాడుతున్నారని లేని ఎద్దేవా చేశారు. బనకచర్ల విషయంలో ఇప్పుడు నానా యాగీ చేస్తున్న వారు పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో గుర్తు చేసుకోవాలని హితవు పలికారు.
ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) పని చేస్తోందని, అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తోందని శ్రీధర్ తెలిపారు. మహిళలకు ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేపట్టామని, యూనిఫామ్‌లు కుట్టే పనులతో పాటు సోలార్ ప్యానల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిని కూడా మహిళలకే అప్పగించామన్నారు. మహిళా సంఘాలకు రుణాలు ఇప్పించి బస్సులు కొనిపించి ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం సంపాదించుకునే మార్గాలను ఏర్పాటు చేశామన్నారు.