అక్షరటుడే, కామారెడ్డి: Minister Komatireddy | రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) సోమవారం జుక్కల్ నియోజకవర్గంలో (Jukkal constituency) పర్యటించనున్నారు. ఉదయం 11:40 గంటలకు మద్దెలచెరువు–పిట్లం రోడ్, తిమ్మానగర్ వద్ద రూ.4.86 కోట్లతో నిర్మించిన హై లెవల్ వంతెనను ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం 12:10 గంటలకు బిచ్కుంద నుంచి డోంగ్లీ వరకు రూ.13.20 కోట్లతో నిర్మించే రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 12:30 గంటలకు ఎమ్మెల్యే లక్ష్మికాంతా రావు (MLA Laxmikanta Rao) , జిల్లా ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులతో పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. ఒంటి గంటకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కలెక్టర్, జిల్లా ఉన్నతాధికారుతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్షించనున్నారు. అనంతరం ఇటీవల మృతిచెందిన సీనియర్ జర్నలిస్ట్ దత్తురెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.