ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMidday meals | నిలిచిన మధ్యాహ్న భోజనం.. ఇంటిదారి పట్టిన విద్యార్థులు

    Midday meals | నిలిచిన మధ్యాహ్న భోజనం.. ఇంటిదారి పట్టిన విద్యార్థులు

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Midday meals | పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిలిచిపోవడంతో విద్యార్థులు పస్తులుండిపోయారు. బుధవారం దేశవ్యాప్త కార్మికుల సమ్మెల కారణంగా జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికులు ఒకరోజు సమ్మె చేపట్టారు. దీంతో మండలంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం (midday meals) నిలిచిపోయింది.

    Midday meals | నిజాంసాగర్​ మండల కేంద్రంలో..

    నిజాంసాగర్ మండల కేంద్రంలోని (Nizamsagar mandal center) ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం అందించలేదు. దీంతో మాగి గోర్గుల్​, జీఎస్​ఆర్​ ఫ్యాక్టరీ వడ్డేపల్లి గ్రామాల విద్యార్థులు మధ్యాహ్నానికి ఇళ్లకు వెళ్లిపోయారు. నిజాంసాగర్ మండల కేంద్రంలో ఉండి చదువుకునే విద్యార్థులు మాత్రం ఇళ్లకు వెళ్లి భోజనాలు చేసి తిరిగి స్కూల్​కు వెళ్లారు. బీసీ వసతి గృహంలో విద్యార్థులకు అప్పటికప్పుడు భోజనాలు తయారు చేయించారు.

    READ ALSO  New Ration Cards | రేషన్​ కార్డులపై కీలక అప్​డేట్​.. కొత్తగా ఎన్ని కార్డులంటే..

    Midday meals | ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేక..

    నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం చర్చనీయాంశమైంది. దేశవ్యాప్త సమ్మె ఉన్నట్లు ముందుగానే సమాచారం ఉన్నప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. ఉపాధ్యాయులు మాత్రం పక్కనే ఉన్న బీసీ వసతి గృహం (BC hostel) నుంచి భోజనాన్ని తెప్పించుకొని భోజనం చేసినట్లు తెలిసింది. విద్యార్థులు మాత్రం ఇళ్లకు వెళ్లిపోయారు.

    Midday meals | ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు

    – తిరుపతిరెడ్డి, ఎంఈవో

    నిజాంసాగర్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు భోజనం ఏజెన్సీ నిర్వాహకులు ఆలస్యంగా సమాచారం ఇవ్వడంతో బుధవారం మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేయలేకపోయారు. అందుకే విద్యార్థులు ఇంటి బాట పట్టారు. మరోసారి ఇలాంటి తప్పు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటాం.

    Latest articles

    YS Jagan | రెడ్​బుక్​ రాజ్యాంగంతో రాష్ట్రంలో భయానక పరిస్థితులు : వైఎస్​ జగన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: YS Jagan | రెడ్​బుక్​ రాజ్యాంగం(Red Book Constitution)తో రాష్ట్రంలో భయానక పరిస్థితులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్​...

    PDSU | పీడీఎస్​యూ నాయకుల ముందస్తు అరెస్ట్

    అక్షరటుడే, డిచ్​పల్లి: PDSU | జిల్లాలో గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ(Governor Jishnu Dev Verma) పర్యటన సందర్భంగా పీడీఎస్​యూ...

    Warangal | భర్తకు విషమిచ్చి బావ దగ్గరకు వెళ్లిపోయిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Warangal | దేశవ్యాప్తంగా భార్యలు భర్తలను హతమారుస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వివాహేతర సంబంధాలు...

    Bichkunda | యువకుడి దారుణ హత్య

    అక్షరటుడే, బిచ్కుంద: Bichkunda | సమాజంలో నానాటికి నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. కారణం ఏదైనా మరొకరి ప్రాణాలు తీసేందుకు...

    More like this