అక్షరటుడే, వెబ్డెస్క్ : Rangareddy | రంగారెడ్డి(Rangareddy) జిల్లా యాచారం మండలం చౌదరిపల్లి గ్రామంలో రైతు కమిషన్ సభ్యులు (Members of Farmers’ Commission) శుక్రవారం పర్యటించారు. ఆదర్శ రైతు కాశమల్ల వెంకట్రాములు వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు.
ఛైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, గడుగు గంగాధర్, మెంబర్ సెక్రెటరీ గోవింద్ తదితరులు పాల్గొన్నారు. మల్లేశ్ పట్టు పురుగుల పెంపకం చేపడుతున్నాడు. మల్బరీ సాగు ద్వారా ఎలాంటి లాభాలున్నాయని ఆరా తీశారు. పట్టు పురుగుల పెంపకం గురించి తెలుసుకున్నారు.