అక్షరటుడే, ఇందూరు:May Day | అమరవీరుల స్ఫూర్తితో మేడే నిర్వహించుకుందామని ఏఐటీయూసీ (AITUC) జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయం వాల్పోస్టర్లను(Wall Posters) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..1886లో అమెరికా చికాగోలో వేలాదిమంది కార్మికులు 8 గంటల పని అమలు చేయాలని పోరాటం చేస్తుంటే అక్కడి ప్రభుత్వం లాఠీఛార్జీ(Government lathicharge) చేసి కాల్పులు జరిపిందని గుర్తు చేశారు.
ఈ ఘటనలో వందలాది మంది ప్రాణాలను కోల్పోయారని వారి స్ఫూర్తితో అనేక చట్టాలను సాధించామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు చక్రపాణి, కార్యదర్శి హన్మాండ్లు, నాయకులు అంజలి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.