అక్షరటుడే, వెబ్‌డెస్క్:Keshava Ro | మావోయిస్ట్(Maoist)లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లలో 28 మంది మృతి చెందారు. ఇందులో మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు(Maoist leader Nambala Kesava Rao) అలియాస్ బసవరాజ్ అలియాస్ గగన్న హతమయ్యాడు. మాధ్ ప్రాంతంలో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.
Keshava Rao | సుప్రీం కమాండర్ హతం
నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఇందులో మావోల సుప్రీం కమాండర్, 2003లో అలిపిరి వద్ద అప్పటి ఉమ్మడిరాష్ట్ర సీఎం చంద్రబాబు(CM Chandrababu)పై బాంబుదాడి ప్రధాన సూత్రదారి నంబాల కేశవరావు కూడా మరణించాడు. ఆయన ఇప్పుడు మావోయిస్టు ఉద్యమంలో ప్రముఖ నాయకుడు. ప్రస్తుతం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
Keshava Rao | బీటెక్ చదివి..
కేశవరావు(Keshava Rao) ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా జియన్నపేట గ్రామంలో 1955లో జన్మించాడు. వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (అప్పటి రీజినల్ ఇంజినీరింగ్ కాలేజ్) నుంచి బీటెక్(B Tech) పూర్తి చేశాడు. అనంతరం మావోయిస్టు ఉద్యమం పట్ల ఆకర్షితుడు అయ్యాడు. 1970ల నుంచి నక్సలైట్ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నాడు. 1980లో పీపుల్స్ వార్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాడు.
Keshava Rao | అనేక దాడుల వెనుక కీలక పాత్ర
నంబాల కేశవరావు అనేక ప్రధాన మావోయిస్టు దాడుల వెనుక కీలక పాత్ర పోషించాడు. అలిపిరి వద్ద చంద్రబాబు నాయుడుపై బాంబుదాడిలో కూడా ప్రధాన సూత్రధారి కేశవరావే. 2003 అక్టోబర్ 1న తిరుమలలోని అలిపిరి వద్ద సీఎం చంద్రబాబు నాయుడుపై మావోయిస్టులు బాంబు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వెళ్తుండగా మందుపాతరతో మావోలు దాడి చేశారు. ఇందులో కేశవరావు కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. దంతేవాడలో 76 సీఆర్‌పీఎప్ (CRPF) జవాన్లపై దాడిలో, జీరాం ఘాటిలో 27 మందిని చంపిన ఘటనలో కూడా కీలకంగా వ్యవహరించాడు. గెరిల్లా దాడులు చేయడంలో కేశవరావుకు ప్రావీణ్యం ఉంది. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలాం (LTTE) మాజీ యోధుల దగ్గర ఆయన శిక్షణ పొందినట్లు సమాచారం.
Keshava Rao | రూ.1.5 కోట్ల రివార్డు
కేశవరావు ప్రస్తుతం ఎన్ఐఏ హిట్ లిస్టు(NIA Hit List)లో ఉన్నారు. ఆయనపై రూ.1.5 కోట్ల రివార్డ్ ఉంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర అడవుల్లో మావోయిస్టు కార్యకలాపాలను నడిపిస్తున్న కేశవరావు మృతి ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బగా పలువురు పేర్కొంటున్నారు.