అక్షరటుడే, వెబ్డెస్క్: Tamil Nadu | తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా తయారీ పరిశ్రమలకు నెలువైన శివకాశి(Sivakasi)లో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు.
తమిళనాడు(Tamil Nadu)లోని శివకాశిలో మంగళవారం ఉదయం ఓ బాణసంచా(Fireworks) తయారీ కేంద్రంలో పేలుడు చోటు చేసుకుంది. ఒక్కసారిగా పేలుడు సంభంవించి మంటలు వ్యాపించాయి. దీంతో అందులో పని చేసే కార్మికులు మృతి చెందారు. ఇందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. పేలుడు దాటికి మూడు గదులు ధ్వంసం అయ్యాయి. పలువురు తీవ్రంగా గాయపడగా.. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.