అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Earthquake | రష్యా (Russia)లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.4గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. రష్యాలోని పసిఫిక్ తీరంలో 7.4 తీవ్రతతో భూకంపం రావడంతో కమ్చట్కా(Kamchatka) ద్వీపకల్పానికి సునామీ(Tsunami) హెచ్చరికలు జారీ చేశారు.
యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం 32 నిమిషాల వ్యవధిలో పెట్రోప్లావ్స్కా– కమ్చట్కా తీరంలో మూడు శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంపాలతో జరిగిన నష్టంపై ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. భూకంప కేంద్రం పది కిలో మీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.