అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Promotions | వైద్యారోగ్య శాఖ(Health Department)లో పలువురికి పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పలువురు ప్రొఫెసర్లకు(Professors) మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్(Medical College Principal), టీచింగ్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌తో సహా మెడికల్ ఎడ్యుకేషన్(Medical Education) అదనపు డైరెక్టర్‌గా తాత్కాలిక పదోన్నతికి కల్పించింది. ఈ మేరకు వైద్యారోగ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ(Health Secretary Christina Z. Chongtu) మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 44 మందికి ప్రమోషన్ కల్పించింది. ప్రభుత్వ వైద్య కాలేజీల ప్రిన్సిపాల్స్‌గా, జిల్లా జనరల్ ఆస్పత్రుల సూపరింటెండెంట్లుగా పదోన్నతి కల్పించింది. పదోన్నతి పొందిన వారు సంబంధిత పోస్టులతో 15 రోజుల్లో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఈ పోస్టుల నుంచి ఎప్పుడైనా తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉందని పేర్కొంది.
Read all the Latest News on Aksharatoday.in