More
    Homeఆంధ్రప్రదేశ్​Padma Awards 2025 | పద్మశ్రీ పురస్కారం అందుకున్న మందకృష్ణ.. నటి శోభనకు పద్మభూషణ్‌ ప్రదానం

    Padma Awards 2025 | పద్మశ్రీ పురస్కారం అందుకున్న మందకృష్ణ.. నటి శోభనకు పద్మభూషణ్‌ ప్రదానం

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Padma Awards 2025 : దేశ రాజధాని ఢిల్లీ(national capital Delhi)లో పద్మ పురస్కారాల రెండో విడత ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. పలు రంగాల్లో విశేష సేవలందించిన పలువురికి రాష్ట్రపతి భవన్‌(Rashtrapati Bhavan)లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేడుకలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Draupadi Murmu) ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ప్రదానం చేశారు.

    రిటైర్డ్ సీజేఐ జస్టిస్​ జగదీశ్ సింగ్ ఖేకర్ (Retired CJI Justice Jagdish Singh Khekar) రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు​. సినీనటి శోభన (Film actress Shobhana), కన్నడ నటుడు అనంత్‌ నాగ్ (Kannada actor Anant Nag)ను రాష్ట్రపతి పద్మభూషణ్​తో సత్కరించారు. MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (MRPS founder president Mandakrishna Madiga) పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.

    దిగ్గజ ఫోక్ సింగర్​ శారద సిన్హా మరణానంతరం పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ క్రమంలో ఆమె కుమారుడు అన్షుమాన్ సిన్హా.. శారద తరఫున అవార్డు అందుకున్నారు.​ మరణానంతరం ఎంపికైన కుముదిని రజినికాంత్ తరఫున ఆమె మనవడు పద్మ విభూషణ్ పురస్కారం​ తీసుకున్నారు.

    ఆంధ్రప్రదేశ్‌ నుంచి వి.రాఘవేంద్రాచార్య పంచముఖి, ప్రొఫెసర్‌ కేఎల్‌ కృష్ణ పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. ప్రధానమంత్రి వద్ద ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్మన్​గా పని చేసిన బిబేక్ దేబ్రోయ్​ పద్మ భూషణ్​ పురస్కారానికి ఎంపిక కాగా.. ఆయన భార్య అవార్డు అందకున్నారు.

    పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi), ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా lok sabha speaker Om Birla, కేంద్రమంత్రులు అమిత్‌ షా, జైశంకర్‌, కిషన్‌ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్‌, ప్రహ్లాద్‌ జోషీ తదితరులు హాజరయ్యారు. పురస్కార గ్రహీతల కుటుంబ సభ్యులు పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తపర్చారు.

    Latest articles

    Sajjanar | సివిల్స్​ ర్యాంకర్​ను అభినందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sajjanar | సివిల్స్‌లో(Civils) ప్ర‌తిభ క‌న‌బ‌రిచి 11వ‌ ర్యాంకు సాధించిన వ‌రంగ‌ల్‌కు చెందిన ఇట్ట‌బోయిన...

    Telangana Politics | బీజేపీ, బీఆర్ఎస్ ఒక్క‌టేనా?.. ఒకేలైన్‌లో క‌విత‌, రాజాసింగ్ వ్యాఖ్య‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Politics | రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ (BJP and BRS) మ‌ధ్య పోటీ...

    Hyderabad | కావాలనే కేసులు పెట్టించుకుంటున్న నైజీరియన్లు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్(Hyderabad)​ నగరంలో పలు ప్రాంతాల్లో నైజీరియన్లు(Nigerians) నివసిస్తున్నారు. మెహదీపట్నం, లంగర్​హౌజ్​, సన్​సిటీ,...

    Hyderabad | కార్పొరేటర్​ వేధింపులు తాళలేక ఆత్మహత్య

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Hyderabad | నగరాలు, పట్టణాల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలంటే ఈ రోజుల్లో రూ.లక్షల లంచాలు ఇవ్వాల్సిందే....

    More like this