అక్షరటుడే, వెబ్డెస్క్: Tirumala | తిరుమల (Tirumala) ఘాట్ రోడ్డులో ఓ వ్యక్తి లోయలోకి దూకడం తీవ్ర కలకలం సృష్టించింది. మోకాళ్ల పర్వతం సమీపంలోని అవ్వాచారి కోన దగ్గర ఓ వ్యక్తి బుధవారం ఉదయం లోయలోకి దూకేశాడు.
గమనించిన భక్తులు(Devotees) వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రెస్క్యూ టీం(Rescue Team) ఘటన స్థలానికి చేరుకొని అతడిని కాపాడింది. లోయ లోతుగా ఉన్నా.. ప్రాణాలకు తెగించి సిబ్బంది అతడిని బయటకు తీసుకొచ్చారు. సదరు వ్యక్తి తీవ్ర గాయపడడంతో తిరుమల అశ్వని ఆస్పత్రి (Tirumala Ashwani Hospital)కి తరలించారు. అయితే భక్తుడి వివరాలు తెలియరాలేదు. విచారణ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని తిరుమల పోలీసులు(Tirumala Police) తెలిపారు.