అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kharge Meeting | రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికల నగారా మోగనుంది.
సెప్టెంబర్ 30 లోపు పంచాయతీ ఎన్నికలు (panchayat elections) నిర్వహించాలని ఇటీవల హైకోర్టు (High court) ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ఆయా రాజకీయ పార్టీలు స్థానిక సమరానికి సన్నద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Congress national president Mallikarjun Kharge) గురువారం హైదరాబాద్ రానున్నారు.
Kharge Meeting | ఎల్బీ స్టేడియంలో భారీ సభ
మల్లికార్జున ఖర్గే గురువారం సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు (Shamshabad airport) చేరుకుంటారు. ఆయన శుక్రవారం ఉదయం గాంధీభవన్‌లో పీఏసీ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అడ్వైజరీ కమిటీతో భేటీ నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో (LB Stadium) గ్రామ, మండల కమిటీ అధ్యక్షులతో నిర్వహించే సభలో పాల్గొని మాట్లాడుతారు.
Kharge Meeting | పక్కాగా ఏర్పాట్లు
మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) నగరంలో పర్యటించనుండటంతో కాంగ్రెస్ పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న సభ ఏర్పాట్లను బుధవారం కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan), పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ (Mahesh kumar Goud) పరిశీలించారు. ఖర్గే సభను విజయవంతం చేయాలని ఇప్పటికే రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.