More
    HomeజాతీయంMalaria Vaccine | మలేరియా వ్యాక్సిన్ ధర సగం తగ్గింపు.. సంచలన నిర్ణయం తీసుకున్న భారత్...

    Malaria Vaccine | మలేరియా వ్యాక్సిన్ ధర సగం తగ్గింపు.. సంచలన నిర్ణయం తీసుకున్న భారత్ బయోటెక్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Malaria Vaccine | ప్రపంచంలోని మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ RTS,S ధరను భారత్ బయోటెక్ (Bharat Biotech) భారీగా తగ్గించింది. పిల్లల కోసం తయారు చేసిన ఈ వ్యాక్సిన్ ధరను 50 శాతం మేర తగ్గిస్తున్నట్లు భారత్ బయోటెక్, గ్లోబల్ బయోఫార్మా కంపెనీ (global biopharma company) GSK ప్రకటించాయి. 2028నాటికి దీని ధర 5 డాలర్ల కంటే దిగువకు వచ్చే అవకాశముంది. 2025 చివరి నాటికి 12 ఆఫ్రికన్ దేశాల్లో (African countries) వ్యాక్సిన్ విడుదల చేయనున్నారు. మలేరియాను పూర్తిగా నివారించడంతో పాటు అన్ని దేశాలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో తాజాగా ధరను తగ్గించారు.

    GSK, PATH, ఇతర భాగస్వాములు అభివృద్ధి చేసిన RTS,S వ్యాక్సిన్​ను 2021లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) సిఫారసు చేసిన మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ ఇదే. మరోవైపు, భారత్ బయోటెక్ (Bharat Biotech) కొత్త హై-అవుట్​పుట్​ సౌకర్యాలలో 200 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టి GSK నుంచి కీలకమైన సాంకేతిక బదిలీని తీసుకుంది. ఈ నేపథ్యంలో మలేరియా వ్యాక్సిన్ ధరను సగానికి సగం తగ్గించాలని భారత్ బయోటిక్ నిర్ణయించింది. మలేరియా వల్ల లక్షలాది మంది పిల్లలు, కుటుంబాలపై భారాన్ని తగ్గించడమే తమ లక్ష్యమని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. మలేరియా నుంచి పిల్లలను రక్షించాలన్నదే తమ ఉమ్మడి లక్ష్యమని GSK చీఫ్ గ్లోబల్ హెల్త్ ఆఫీసర్ థామస్ బ్రూయర్ తెలిపారు.

    READ ALSO  Tamil Nadu | ఆస్తులు కావాలని వేధించిన కుమార్తెలు.. రూ.నాలుగు కోట్ల విలువైన ఆస్తిని ఆలయానికి విరాళం ఇచ్చిన తండ్రి..

    Latest articles

    Ahmedabad Plane Crash | బ్లాక్​ బాక్స్​ నుంచి డేటా డౌన్​లోడ్​ చేసిన అధికారులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Ahmedabad Plane Crash | అహ్మదాబాద్​ విమానం ప్రమాదం దర్యాప్తులో అధికారులు కీలక పురోగతి సాధించారు. జూన్​...

    Kamareddy Collector | యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collector | యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(Collector Ashish...

    Justice Gavai | రాజ్యాంగ‌మే అత్యున్న‌తం.. సీజేఐ జ‌స్టిస్ గవాయ్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Justice Gavai | కేంద్రం, న్యాయ వ్య‌వస్థ మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తున్న క్ర‌మంలో.. భార‌త ప్ర‌ధాన...

    RTA Offices | ఆర్​టీఏ కార్యాలయాలపై ఏసీబీ దాడులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:RTA Offices | రాష్ట్రంలోని రవాణా శాఖ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. తెలంగాణలో 18 ఆర్​టీఏ...

    More like this