అక్షరటుడే, వెబ్‌డెస్క్: Covid | మళ్లీ కరోనా విజృంభిస్తుంది. పలు దేశాలలో కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్ (travis head) వైరస్ బారిన పడ్డట్టు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు (super star mahesh babu) ఫ్యామిలీలో కరోనా కలకలం రేపుతోంది. మహేష్ బాబు భార్య నమ్రత (mahesh babu wife namrata) సోదరికి కరోనా సోకింది(covid positive). ఈ విషయాన్ని సోషల్ మీడియా (social media) ద్వారా నటి శిల్పా శిరోద్కర్ కోవిడ్-19 పాజిటివ్‌గా (covid-19 positive) నిర్ధారణ అయినట్లు చెప్పుకొచ్చింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో (instagram account) ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘మిత్రులారా! నాకు కొవిడ్ పరీక్షలో పాజిటివ్ అని తేలింది. మీరు జాగ్రత్తగా ఉండండి.. ముందు జాగ్రత్తగా మాస్క్‌ను ధరించండి’ అంటూ ఇన్ స్టా గ్రామ్‌లో పేర్కొంది.
Covid | కరోనా విజృంభణ..
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన బాలీవుడ్ (bollywood) సినీ పప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శిల్పాకు ధైర్యం చెప్పారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం శిల్పా దుబాయ్‌లో (dubai) తన కుటుంబంతో నివసిస్తున్నారు. ఆమె అభిమానులు త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ నటి (bollywood actor), టాలీవుడ్ హీరో మహేష్ బాబు (tollywood hero mahesh babu) వదిన శిల్పా శిరోద్కర్ కోవిడ్ 19 గతంలోను కరోనా బారిన పడ్డారు. శిల్పా శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ (shilpa shirodkar instagram post) ద్వారా కరోనా సోకిందని తెలియజేశారు.
అయితే సోదరి కరోనా (corona) బారిన పడిన విషయాన్ని తెలుసుకున్న నమ్రతా (namrata) ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఈ మేరకు శిల్పా పోస్టుకు స్పందించిన ఆమె లవ్ ఎమోజీలతో రిప్లై ఇచ్చింది. నమ్రతాతో పాటు సోనాక్షిసిన్హా, సోనాలి బింద్రే, డయానా పాండే తదితర సినీ ప్రముఖలు శిల్పా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇప్పటికే కరోనా వైరస్ (corona virus) ఆసియా దేశాలైన హాంకాంగ్ మరియు సింగపూర్‌లో (hong kong and singapoor) కరోనా వైరస్ (కొవిడ్-19) మళ్లీ విజృంభిస్తూ ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్‌తో పాటు అడినోవైరస్ మరియు రైనో వైరస్‌ల (adenovirus and rhinovirus) వ్యాప్తి కూడా పెరుగుతుండడంతో ఆరోగ్య అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో భారతదేశంలో కూడా కేసులు నమోదవుతున్నాయి.