అక్షరటుడే, ఇందూరు: Padmashali Sangham | పద్మశాలి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా బిల్ల మహేష్ నియామకమయ్యారు. ఈ మేరకు మంగళవారం అఖిల భారత పద్మశాలి సంఘం (All India Padmashali Association) ప్రధాన కార్యదర్శి జగన్నాథం, రాష్ట్ర అధ్యక్షుడు మురళి ఆయనకు నియామక పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంఘ ఐక్యతకు అభివృద్ధికి కృషిచేయాలని సూచించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ.. తనకు అప్పజెప్పిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తిస్తానని తెలిపారు. ఎటువంటి సమస్యలు ఎదురైనా జాతీయ, రాష్ట్ర సంఘం దృష్టికి తీసుకొస్తానని పేర్కొన్నారు. భవిష్యత్తులో అన్ని అనుబంధం సంఘాలతో కలిసి కార్యక్రమాలను నిర్వహిస్తానన్నారు. కార్యక్రమంలో పట్టణ సంఘం ఉపాధ్యక్షులు కన్నా దుబ్బ రాజాం, శ్రీనివాస్, కార్యదర్శులు సుభాష్, రవి, కార్యనిర్వాహక కార్యదర్శి గంగరాజు, ప్రచార కార్యదర్శి శ్రీనివాస్, భాస్కర్, రవి, మురళి, సత్యపాల్, దోర్నాల రాజు, బొట్టు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.