అక్షరటుడే, ఇందూరు:Basaveshwara Jayanti | మహాత్మా బసవేశ్వర ఆశయాలకనుగుణంగా సామాన్యులకు ప్రభుత్వ ఫలాలు అందే విధంగా కృషి చేయాలని అదనపు కలెక్టర్ అంకిత్(Additional Collector Ankit) అన్నారు. బుధవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బసవేశ్వర జయంతి (Basaveshwara Jayanti) నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాన్యుల కోసం ఎంతో కృషి చేసిన మహనీయుడు బసవేశ్వరుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారిణి స్రవంతి, సహాయ అధికారి నరసయ్య, గంగాధర్, లింగాయత్ సంఘం ప్రతినిధులు చంద్రశేఖర్, బసవన్న, రాజ్కుమార్, బుస ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Basaveshwara Jayanti | పోతంగల్ మండల కేంద్రంలో..
అక్షరటుడే, కోటగిరి : పోతంగల్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో వీరశైవ లింగాయత్ సమాజ్ (Veerashaiva Lingayat Samaj) ఆధ్వర్యంలో బుధవారం బసవేశ్వర జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బసవేశ్వరుని విగ్రహానికి పూలమాలలు వేసి మహిళలు మంగళ హారతులతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో లింగాయత్ సమాజ్ అధ్యక్షుడు దిగంబర్ పటేల్, శాంతేశ్వర్ పటేల్, ప్రకాష్ పటేల్, కుశాల్ పటేల్, హన్మంత్ రావు పటేల్,కేశ వీరేశం, ఎంఏ హకీం తదితరులున్నారు.
Basaveshwara Jayanti | నిజాంసాగర్‌లో..
అక్షరటుడే, నిజాంసాగర్: పిట్లం మండలంలోని కంబాపూర్ గ్రామంలో బుధవారం బసవేశ్వర జయంతిని ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే (Former MLA of Jukkal Hanmant Shinde) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక నాయకులు విజయ్ నర్సా గౌడ్, జొన్న శ్రీనివాస్ రెడ్డి, సాయి రెడ్డి, ప్రమోద్ తదితరులు ఉన్నారు.