అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Madhuri Dixit | పహల్గామ్‌లో (Pahalgam) జరిగిన ఉగ్రవాద దాడి (terrorist attack) తర్వాత భారతీయులు అందరు పాకిస్తాన్ (Pakistan)ని మట్టి కరిపించాలనే కసితో ఉన్నారు. ఇక ఈ ఘనట తర్వాత భారత ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకుంటుంది. సింధు జల ఒప్పందం రద్దుతో మొదలైన ఆంక్షలు.. దౌత్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. భారతదేశం (india) దూకుడు వైఖరి, పాకిస్తాన్ (pakistan) చర్యలను చూస్తుంటే, యుద్ధం ఖాయంగా కనిపిస్తుంది. పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ (Abdul Basit) ఇటీవల సంచలన ప్రకటన చేశారు. రష్యాలో Russia విజయ దినోత్సవం Victory Day తర్వాత మే 10-11 తేదీల్లో భారతదేశం పాకిస్తాన్‌పై దాడి చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు.
Madhuri Dixit | ఏం జరగనుంది..
రష్యా (Russia) మే 9వ తేదీన విజయ దినోత్సవం (Victory Day) జరుపుకుంటుంది. దీనికి ప్రధానమంత్రి మోడీ (prime minister Modi) హాజరు కావాల్సి ఉన్నా కూడా పాకిస్తాన్‌తో ఉద్రిక్తత కారణంగా ఆయన పర్యటనను రద్దు చేసుకున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh) ప్రధాని స్థానంలో వెళ్లాల్సి ఉంది, కానీ ఆయన కూడా వెళ్లడం లేదు. అబ్దుల్ బాసిత్ ప్రకటనతో పాటు, భారతదేశం సన్నాహాలు కూడా మే 10 లేదా 11 తేదీలలో పాకిస్తాన్‌పై దాడి చేయవచ్చని సూచిస్తున్నాయి. 1971లో భారత్-పాకిస్తాన్ యుద్ధానికి (Ind-Pak war) ముందు చివరిసారిగా మాక్ డ్రిల్ (mock drill) నిర్వహించారు. ఈ డ్రిల్ నిర్వహించిన నాలుగు రోజులకే రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. తరువాత నవంబర్ చివరి వారంలో ఒక మాక్ డ్రిల్ (mock drill) నిర్వహించారు. డిసెంబర్ 3న యుద్ధం ప్రారంభమైంది.
భారత్-పాకిస్తాన్ (India and Pakistan) మధ్య యుద్ధం జరగడం ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్‌కు చెందిన ఓ మతగురువు చేసిన వివాదాస్పద వ్యాఖ్య సోషల్ మీడియాలో (social media) తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఆయన మాట్లాడిన వీడియో ఎక్స్‌లో వైరల్‌గా వ్యాపిస్తోంది. వీడియోలో, ఒక మతగురువు తన కొడుకు పక్కన కూర్చుని .. భారత్ (India)పై యుద్ధంలో పాకిస్తాన్ గెలిస్తే మాధురీ దీక్షిత్‌ను (Madhuri Dixit) తీసుకుంటానని అన్నారు. ఆయన వ్యాఖ్య తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఆ మతగురువును నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.