అక్షర టుడే, నిజాంసాగర్: Dog Bite | మద్నూర్ (Madnoor) మండలకేంద్రంలో సోమవారం పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. దాడిలో తొమ్మిది మంది గాయపడగా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
దీంతో స్థానికులు బాధితులను వెంటనే మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి (Madnoor Government Hospital) తరలించగా.. అనంతరం మెరుగైన చికిత్స నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి (Nizamabad GGH) పంపించారు. పిచ్చికుక్క దాడిలో గ్రామానికి చెందిన ఎస్‌కె కాజామీయా, ఎస్‌కె అస్లం, బేబీ, ఈరేషం, ఎస్‌కె హార్బస్, లాలాగౌడ్, మోహన్, షేక్ అమన్, రాములు గాయాలపాలయ్యారు. కాగా.. గ్రామంలో కుక్కల బెడద నివారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.