అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bitcoin fraud | తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ప్రజల అత్యాశే మోసగాళ్లకు ఆయుధం. స్టాక్స్‌లో పెట్టుబడి stocks invest పెడితే మంచి రిటర్న్స్ వస్తాయని, మా ప్రొడక్ట్‌లు విక్రయిస్తే అధిక లాభాలు వస్తాయని, కొవ్వొత్తులు, కరక్కాయ పొడి ప్యాకింగ్ అంటూ రకరకాల మోసాలు online fraud మనం చూస్తునే ఉన్నాం. దీనికి ప్రధాన కారణం ప్రజల అమాయకత్వానికి తోడు అత్యాశే. తాజాగా ఇలాగే బిట్ కాయిన్ పేరిట కొందరు కోట్లు కొల్లగొట్టారు.
లైకా బిట్‌కాయిన్ lyka Bitcoinలో పెట్టుబడి పెడితే ఏడాదిలో మూడింతల ఆదాయం వస్తుందని నమ్మించారు. ఈ మేరకు హైదరాబాద్ Hyderabad city శివారులోని కీసర keesara police పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో ప్రచారం కూడా చేశారు. రూ.పది వేలు ఇన్వెస్ట్ చేస్తే ఏడాది తర్వాత రూ.30 వేలు వస్తాయని చెప్పారు. దీంతో చాలా మంది వారి మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టారు. తీరా పెట్టుబడికి లాభాలు ఏవీ అని ప్రశ్నించే సరికి.. పత్తా లేకుండా పోయారు. దీంతో మోసపోయామని గ్రహించిన పలువురు బాధితులు కీసర పోలీసులను ఆశ్రయించారు.
అసలు లైకా బిట్ కాయిన్ అనేది లేదు. కానీ మోసగాళ్లు ఫేక్ వెబ్సైట్ fake website క్రియేట్ చేసి ప్రజలను మోసం చేశారు. ఇలా రూ.11 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయిన శ్రీరంగం, వీరేంద్ర, బ్రహ్మచారి అనే వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనేక మంది ఇందులో పెట్టుబడి పెట్టారని, వారు ఇంకా బయటకు రావడం లేదని బాధితులు తెలిపారు. ప్రస్తుతం లైకా బిట్ కాయిన్ వెబ్ సైట్ కూడా పని చేయటం లేదని, తమ డబ్బులు ఇప్పించాలంటూ బాధితులు పోలీసులను కోరారు.