అక్షరటుడే, ఇందూరు: Layout Regularization Scheme | అనధికార లేఔట్ల క్రమబద్దీకరణ, ప్లాట్ల రెగ్యులరైజేషన్ (Regularization of plots) కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఎల్ఆర్ఎస్ 25 శాతం రాయితీ సదుపాయాన్ని మరో మూడు రోజుల పాటు పొడిగించిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు(Collector Rajiv Gandhi Hanuman) తెలిపారు. ఏప్రిల్ 30వ తేదీ నాటితో ఈ గడువు ముగియగా, ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు మే 3 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు.
ఎఫ్టీఎల్, నిషేధించిన సర్వే నెంబర్లు మినహా ఎల్ఆర్ఎస్(LRS)కు దరఖాస్తు చేసుకున్న వారందరికీ రెగ్యులరైజేషన్ రుసుం నిర్ణయించామని కలెక్టర్ వివరించారు. ఫీజు ఎంత అనేది దరఖాస్తుదారులు తమ సెల్‌నెంబర్ ద్వారా లాగిన్ అయి చూసుకోవాలని తెలిపారు. ఫీజు చెల్లించేందుకు అర్హత ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు మే 3వ తేదీలోగా నిర్ణీత రుసుము చెల్లిస్తే 25 శాతం రిబేటు వర్తిస్తుందని తెలిపారు. అలాగే అనధికారికంగా లేఅవుట్లు చేసి, అందులో 10 శాతం ప్లాట్లను విక్రయించిన వారికి మిగతా ఫ్లాట్లను క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు ఉందని, సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.