More
    Homeబిజినెస్​Stock Market | మూడో రోజూ నష్టాలే..! స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌లో రక్తపాతం

    Stock Market | మూడో రోజూ నష్టాలే..! స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌లో రక్తపాతం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock markets) వరుసగా మూడోరోజూ నష్టాల్లోనే ముగిశాయి. గురువారం ఉదయం 41 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్‌(Sensex) ఇంట్రాడేలో గరిష్టంగా 253 పాయింట్లు నష్టపోయింది. కనిష్టాల వద్ద లభించిన మద్దతుతో కోలుకుని 392 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 9 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమై 74 పాయింట్లు పడిపోయింది. ఆ తర్వాత కోలుకుని 125 పెరిగింది. చివరికి సెన్సెక్స్‌ 82 పాయింట్ల నష్టంతో 81,361 వద్ద, నిఫ్టీ(Nifty) 18 పాయింట్ల నష్టంతో 24,793 వద్ద స్థిరపడ్డాయి. మధ్యప్రాచ్యం(Middle east)లో నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలతో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి.

    ఇజ్రాయెల్‌, ఇరాన్‌ల మధ్య యుద్ధం ఎటు దారితీస్తుందోనన్న భయాలతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి తక్కువగానే ఉన్నా.. స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ భారీగా నష్టపోయాయి. బీఎస్‌ఈ(BSE)లో 959 కంపెనీలు లాభపడగా 3,018 స్టాక్స్‌ నష్టపోయాయి. 140 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 73 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 79 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 7 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 10 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ గురువారం రూ. 4.61 లక్షల కోట్లు తగ్గింది.

    READ ALSO  Oil Reserves | అండమాన్​లో భారీగా చమురు నిల్వలు.. భారత్​పై తగ్గనున్న దిగుమతుల భారం

    Stock Market | అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి..

    ఆటో(Auto) సెక్టార్‌ స్టాక్స్‌ మినహా మిగతా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్‌ఈలో ఆటో ఇండెక్స్‌ 0.42 శాతం పెరిగింది. పీఎస్‌యూ బ్యాంక్‌(PSU bank) ఇండెక్స్‌ 2.20 శాతం క్షీణించగా.. రియాలిటీ 1.63 శాతం, ఇన్‌ఫ్రా, పీఎస్‌యూ ఇండెక్స్‌లు 1.45 శాతం, పవర్‌ 1.24 శాతం, మెటల్‌ 1.18 శాతం, టెలికాం, కన్జూమర్‌ డ్యూరెబుల్‌ ఇండెక్స్‌లు 1.06 శాతం, ఐటీ సూచీ 0.95 శాతం, హెల్త్‌కేర్‌ ఇండెక్స్‌ 0.92 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఇండెక్స్‌ 0.82 శాతం పడిపోయాయి. స్మాల్‌ క్యాప్‌(Small cap) ఇండెక్స్‌ 1.77 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1.64 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.33 శాతం నష్టపోయాయి.

    READ ALSO  Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Stock Market | Top gainers..

    బీఎస్‌ఈలో నమోదైన షేర్లలో రెస్టారెంట్‌ బ్రాండ్స్‌(Restaurant Brand) 3.71 శాతం లాభపడగా.. ఎజిస్‌ లాజిస్టిక్స్‌ 3.53 శాతం, టాటా కన్జూమర్‌ 2.24 శాతం, జైబాలాజీ 2.19 శాతం, స్టెర్‌లైట్‌ టెక్నాలజీస్‌ 1.96 శాతం పెరిగాయి.

    Stock Market | Top losers..

    ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌(Electronics mart) 8.36 శాతం, ప్రిన్స్‌ పైప్స్‌ 5.55 శాతం, సియంట్‌ 5.46 శాతం, ఫుజన్‌ ఫైనాన్స్‌ 5.39 శాతం, వెల్‌స్పన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ 5.23 శాతం నష్టపోయాయి.

    Latest articles

    Hydraa | చ‌ర్ల‌ప‌ల్లి చెరువు ఆధునికీకరణకు హైడ్రా చర్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని చ‌ర్ల‌ప‌ల్లి చెరువు (Charlapalli Lake) రూపు రేఖ‌లు...

    Trekking Program | పత్రీజీ మహిళా చైతన్యం ఆధ్వర్యంలో ట్రెక్కింగ్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Trekking Program | పత్రీజీ మహిళా చైతన్యం ఆధ్వర్యంలో భీమ్​గల్​ మండలం (Bheemgal mandal) బడా...

    lawcet 2025 | లాసెట్​లో ర్యాంక్​ సాధించిన ఎమ్మెల్యే

    అక్షరటుడే, వెబ్​డెస్క్: lawcet 2025 | ఎమ్మెల్యే(MLA)గా గెలిచిన వారికి తీరిక ఉండదు. నిత్యం ప్రజలు, కార్యకర్తలతో సమావేశాలు.....

    Bodhan | బంజార సేవాసంఘం కమిటీ ఎన్నిక

    అక్షరటుడే, బోధన్‌: Bodhan | బంజార సంఘం బోధన్‌ పట్టణ, మండల నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నారు. మండలంలోని...

    More like this

    Hydraa | చ‌ర్ల‌ప‌ల్లి చెరువు ఆధునికీకరణకు హైడ్రా చర్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని చ‌ర్ల‌ప‌ల్లి చెరువు (Charlapalli Lake) రూపు రేఖ‌లు...

    Trekking Program | పత్రీజీ మహిళా చైతన్యం ఆధ్వర్యంలో ట్రెక్కింగ్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Trekking Program | పత్రీజీ మహిళా చైతన్యం ఆధ్వర్యంలో భీమ్​గల్​ మండలం (Bheemgal mandal) బడా...

    lawcet 2025 | లాసెట్​లో ర్యాంక్​ సాధించిన ఎమ్మెల్యే

    అక్షరటుడే, వెబ్​డెస్క్: lawcet 2025 | ఎమ్మెల్యే(MLA)గా గెలిచిన వారికి తీరిక ఉండదు. నిత్యం ప్రజలు, కార్యకర్తలతో సమావేశాలు.....