అక్షరటుడే, కామారెడ్డి: Gold Prices | బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. శ్రావణ మాసం (Shravan Masam) పెళ్లిళ్ల సీజన్ కావడంతో చాలామంది బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటారు. కానీ సామాన్యులకు అందనంత దూరంలో బంగారం ధర ఉంటుంది. మంగళవారం కామారెడ్డిలో (Kamareddy) తులం బంగారం ధర రూ. లక్ష పలికింది.
సోమవారం సాయంత్రం తులం బంగారం ధర రూ.99,600 ఉండగా మంగళవారం రూ. లక్ష మార్క్‌ను టచ్ చేసింది. గత కొద్దిరోజులుగా బంగారం ధరలు(Gold Prices) పెరుగుతూనే ఉన్నాయి.
Gold Prices | ఈనెల 26వ తేదీ నుంచి పెళ్లిళ్ల సీజన్
ప్రస్తుతం ఈనెల 26 నుంచి పెళ్లిళ్లకు శుభముహూర్తాలు ఉన్న వేళ.. బంగారం ధరలు(Gold Rates) పెరుగుతుండడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. పెళ్లిళ్ల సీజన్(Wedding Season) మొదలయ్యే వరకు తగ్గుతుందని భావించిన ప్రజలకు మంగళవారం నాటి ధరలు షాక్‌కు గురిచేశాయి. రూ.లక్షతో ఆగకుండా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని స్వర్ణకారులు చెబుతున్నారు.