అక్షరటుడే, నిజాంసాగర్: Navodaya Vidyalaya | నిజామాబాద్‌లో నూతనంగా ఏర్పాటైన నవోదయ విద్యాలయంలో (Nizamabad Navodaya vidyalaya) ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎంపికైన విద్యార్థుల జాబితాను శనివారం ప్రకటించారు. 6వ తరగతిలో ప్రవేశాల కోసం మొత్తం 40 మందిని ఎంపిక చేసినట్లు ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ మను యోహన్నన్ తెలిపారు.
Navodaya Vidyalaya | 14వ తేదీ నుంచి అడ్మిషన్లు..
నవోదయలో ఈనెల 14వ తేదీ నుంచి అడ్మిషన్లు ప్రారంభించనున్నట్లు ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు స్పష్టం చేశారు. సోమవారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నట్లు చెప్పారు.
Navodaya Vidyalaya | జనవరిలో పరీక్ష..
ఈ ఏడాది జనవరి 18న నవోదయ పరీక్ష జరిగింది. ఈ ఎగ్జామ్‌కు సుమారు 6,090 మంది హాజరయ్యారు. ఇందులో భాగంగా ఇప్పటికే 80 మంది విద్యార్థులు నిజాంసాగర్ నవోదయకు అర్హత సాధించారు. తాజాగా నిజామాబాద్‌లో ఏర్పాటైన నవోదయ పాఠశాలకు 40మందిని ఎంపిక చేస్తూ అధికారులు ఉత్తర్వలు జారీ చేశారు.
ఎంపికైన విద్యార్థుల హాల్‌టిక్కెట్ నంబర్లు ఇవే..
