అక్షరటుడే, ఇందూరు: Lions Club | లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని క్లబ్ పూర్వ గవర్నర్ ఎస్ఎస్ శ్యాంకుమార్ పేర్కొన్నారు. డిచ్పల్లి మండలంలోని బర్ధిపూర్ శివారులోని ఈవీఎం గార్డెన్స్‌లో (EVM Gardens) ఏడు లయన్స్ క్లబ్‌ల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, ఫోర్ట్ సిటీ, ఇందూర్, నందిపేట్, సహార, తెలంగాణ, సెంట్రల్ల కార్యవర్గాలతో లయన్స్ పూర్వ గవర్నర్ ఎస్ఎస్ శ్యాంకుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు.
Lions Club | సేవలను విస్తరించాలి..
అనంతరం శ్యాంకుమార్ మాట్లాడుతూ.. లయనిజంలోకి (Lionism) నూతన సభ్యులను చేర్పించి లయన్స్ సేవలను మరింత విసృతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో లయన్స్ జిల్లా మొదటి ఉప గవర్నర్ విజయలక్ష్మి, రెండో ఉప గవర్నర్ నర్సింహరాజు, పూర్వ గవర్నర్లు జి.శ్రీనివాస్, ఈ.వీరేశం, పెంటయ్య, జిల్లా కార్యదర్శి ఎల్.శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అదనపు కార్యదర్శి పి.లక్ష్మీనారాయణ, ప్రోగ్రామ్ ఛైర్మన్ కరిపె రవీందర్, కో ఛైర్మన్ వేములపాటి రవీంద్ర, రీజియన్ ఛైర్మన్ ఉదయ సూర్యభగవాన్, రీజియన్ కో–ఆర్డినేటర్ నాగేశ్వరరావు, జోన్ ఛైర్మన్ అవన్ కుమార్, నర్సింహారావు, భూమన్న, డి.యాదగిరి తదితరులు పాల్గొన్నారు.