అక్షరటుడే, వెబ్‌డెస్క్:India-Pak |పంజాబ్ రాజధాని అమృత్‌సర్(Punjab capital Amritsar)లో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడినుంచి ఐదు పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. అతడికి పాకిస్తాన్(Pakistan)తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. తరన్ తరణ్ జిల్లాలోని నౌషేరా నివాసి అయిన జోధ్‌బీర్ సింగ్‌ను కౌంటర్-ఇంటెలిజెన్స్ విభాగం అరెస్టు చేసిందని పంజాబ్ డీజీపీ(Punjab DGP) మంగళవారం Xలో వెల్లడించారు. సింగ్ వద్ద నుంచి ఐదు పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు, వాటిలో రెండు PX5 పిస్టల్స్, ఒక .30 బోర్ పిస్టల్ (స్టార్ మార్క్డ్), రెండు 9mm గ్లోక్ పిస్టల్స్ ఉన్నాయి.
India-Pak |పాకిస్తాన్‌తో సంబంధాలు
భారతదేశంలోకి అక్రమ ఆయుధాల సరఫరాకు దోహదపడుతున్న పాకిస్తాన్‌కు చెందిన మాదకద్రవ్యాల స్మగ్లర్‌తో జోధ్‌బీర్ సింగ్ సంబంధం కలిగి ఉన్నాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అమృత్‌సర్‌లోని స్టేట్ స్పెషల్ ఆపరేషన్ సెల్ ఈ మేరకు ఎఫ్ఐఆర్(FIR) నమోదు చేసింది. సింగ్ సహచరులను పట్టుకోవడానికి పంజాబ్ పోలీసులు(Punjab Police) రంగంలోకి దిగారు. అదే సమయంలో మొత్తం నెట్‌వర్క్ ఉన్న వారిని గుర్తించేందుకు, పాకిస్తాన్‌తో ఉన్న సంబంధాలను ఆరా తీసేందుకు ప్రత్యేక బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి.
ఏప్రిల్ 27న విశ్వసనీయ సమాచారం మేరకు -ఇంటెలిజెన్స్(Intelligence).. పాకిస్తాన్‌తో సంబంధాలున్న అక్రమ ఆయుధ స్మగ్లింగ్ మాడ్యూల్‌ను ఛేదించింది. అమృత్‌సర్‌కు చెందిన అభిషేక్ కుమార్‌ను అరెస్టు చేసి, అతని నుంచి ఏడు పిస్టళ్లు, నాలుగు లైవ్ కార్ట్రిడ్జ్‌లు (.30 బోర్), రూ.1,50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన జస్సా, పాకిస్తాన్‌కు చెందిన స్మగ్లర్లతో సన్నిహిత సహకారంతో జోధ్‌బీర్ సింగ్, అభిషేక్ కుమార్ సహాయంతో ఇండో-పాక్(Indo-Pak) సరిహద్దు ద్వారా ఆయుధాలు/మందుగుండు సామగ్రిని అక్రమంగా తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు.