అక్షరటుడే, వెబ్‌డెస్క్: Armoor | ఆర్మూర్‌లోని సిద్దులగుట్టపై siddula gutta పై చిరుత సంచారం కలకలం రేపింది. గుట్టపై చిరుత పులి సంచరిస్తున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోమవారం సిద్దుల గుట్టకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం సిద్దుల గుట్ట ఘాట్ రోడ్డుపై గుట్టకు భక్తులు వెళ్తుండగా.. కొండపై చిరుత కనిపించడంతో సెల్ఫోన్లో వీడియో తీసినట్లు తెలుస్తోంది. గుట్టపై చిరుత సంచరిస్తున్నట్లు ప్రచారం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాగా.. ఆలయ కమిటీ సభ్యులు సిద్దుల గుట్టపై చిరుత పులి సంచారంపై ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఎఫ్ఆర్వో శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంగళవారం ఉదయం సిబ్బందితో కలిసి చిరుత జాడ కోసం గాలిస్తామన్నారు.