అక్షరటుడే, వెబ్‌డెస్క్: Lava Storm Lite 5G | సామాన్యుల కోసం స్మార్ట్ ఫోన్లు(Smart phones) తయారు చేసే దేశీయ కంపెనీ లావా(LAVA).. బడ్జెట్ ధరలో మరో మొబైల్‌ను లాంచ్ చేసింది. లావా స్ట్రోమ్ లైట్ 5జీ పేరిట దీనిని తీసుకొచ్చింది. ఆకర్షణీయమైన లుక్‌తో, IP64 రేటింగ్‌తో విడుదల చేసిన ఈ ఫోన్ ధర రూ. 8 వేలలోపే.. అమెజాన్(Amazon)లో అమ్మకాలు ప్రారంభమైన ఈ మోడల్ ఫీచర్లు తెలుసుకుందామా..
డిస్‌ప్లే : 6.75 అంగుళాల HD+ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తోంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేటును కలిగి ఉంది. IP64 రేటింగ్ గల ఈ ఫోన్.. డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గుణాన్ని కలిగి ఉంటుంది.
ప్రాసెసర్ : రోజువారి వినియోగంతోపాటు గేమింగ్, మల్టీ టాస్కింగ్ కోసం ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్ ఉపయోగించారు. ఇది 6nm టెక్నాలజీతో సమర్థవంతమైన 5జీ కనెక్టివిటీ అందిస్తుంది.
సాఫ్ట్‌వేర్ : ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తోంది. ఒక ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్, రెండేళ్లపాటు సెక్యూరిటీలు అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
కెమెరా : సమర్థవంతమైన ఫొటోగ్రఫీ అనుభూతిని ఇవ్వడం కోసం వెనకవైపు 50 MP సోనీ IMX752 సెన్సార్‌తో కూడిన ప్రధాన కెమెరా, ముందువైపు 8 MP కెమెరా అమర్చారు.
బ్యాటరీ : 5000 mAh బ్యాటరీ, 18w ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
కలర్స్ : బ్లూ, కాస్మిక్ టైటానియమ్ రంగుల్లో లభిస్తుంది.
వేరియంట్ : 4GB + 64 GB వేరియంట్ ధర రూ.7,999.
కార్డ్ ఆఫర్ : అమెజాన్ ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి 3 నుంచి 5 శాతం వరకు క్యాష్ బ్యాక్(Cash back) లభిస్తుంది.