అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kubera | తెలుగు చిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ పరిస్థితి ఈ మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఏదైనా సినిమా విడుదలయినా… ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో అంత సక్సెస్ కాలేకపోతున్నారు. పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ప్రేక్షకులు అంత ఈజీగా రావడం లేదు అంటే వారి అంచనాలను అందుకోవడం అంత ఈజీ కాదని అనిపిస్తోంది. ముఖ్యంగా ‘హిట్ 3’, ‘సింగిల్’ వంటి సినిమాలు మాత్రమే కొంత మేర క్రేజ్‌ను నిలబెట్టుకున్నాయి. కానీ మిగిలిన సినిమాలు అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ఈ క్రమంలో శేఖర్ కమ్ముల(Director Shekhar Kammula) దర్శకత్వంలో ధనుష్, నాగార్జున(Nagarjuna)లతో వచ్చిన ‘కుబేరా’ (Kubera)సినిమాపై ఇండస్ట్రీలో భారీ ఆసక్తి నెలకొంది.
Kubera | మంచి ఓపెనింగ్..
కుబేర చిత్రాన్ని వివిధ లోకేషన్లలో షూటింగ్ చేశారు. రెమ్యునరేషన్, చిత్ర నిర్మాణ ఖర్చులు, ప్రమోషన్లు కలుపుకొని రూ.120 కోట్ల మేర బడ్జెట్‌తో రూపొందించారు.. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, శేఖర్ కమ్ముల నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రానికి నాన్ థియేట్రికల్ ద్వారా రూ.65 కోట్ల బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. తమిళంలో రూ.20 కోట్లు, తెలుగులో ఈ చిత్రానికి రూ.40 కోట్ల వ్యాపారం జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక మిగితా స్టేట్స్, ఓవర్సీస్ లో కలిసి రూ.5 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దీంతో ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.60 కోట్ల ఇండియా షేర్, రూ.120 కోట్ల ఇండియా గ్రాస్ వసూల్ చేయాల్సి ఉందని ట్రేడ్ నిపుణులు వాల్యూ కట్టారు.
కుబేరా చిత్రానికి అడ్వాన్స్ బుక్కింగ్స్ ద్వారా రూ. కోటి వరకు వసూలైంది. ఇక ఓవర్సీస్ లో 100k డాలర్లు వసూల్ చేయడం విశేషం. తొలి రోజు శుక్రవారం కుబేరా చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ దక్కింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రానికి తెలుగు స్టేట్స్ లో మంచి వసూళ్లు సాధించినట్టు తెలుస్తోంది. ఇక ఓపెనింగ్ డే ఈ చిత్రానికి సాయంత్రం వరకు రూ.9 కోట్ల ఇండియా నెట్ వసూల్ అయ్యిందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది. దీంతో చేసిందని అంచనా వేసింది. ఇప్పటికే ధనుష్ (Hero Dhanush)రాయన్ చిత్రం మొదటి రోజు కలెక్షన్స్ లో Collections 60 శాతం వసూళ్లు చేసింది. కుబేరా ఓపెనింగ్ డే రూ.25 నుంచి రూ.30 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.