ePaper
More
    HomeతెలంగాణJagga Reddy | కేటీఆర్​ జీరో.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

    Jagga Reddy | కేటీఆర్​ జీరో.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagga Reddy | రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు (Local Body Elections) జరగనున్నాయి. ఈ క్రమంలో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్​(Congress), బీఆర్​ఎస్(BRS)​ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) చర్చకు రావాలని కేసీఆర్​, కేటీఆర్​కు సవాల్​ విసిరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాజీ మంత్రి బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (Ktr)​ సవాల్​ స్వీకరించి మంగళవారం ఉదయం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్​రెడ్డిని విమర్శించారు. కేటీఆర్​ వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) కౌంటర్​ ఇచ్చారు. మంగళవారం ఆయన గాంధీ భవన్​లో విలేకరులతో మాట్లాడారు.

    తమ రాజకీయ అనుభవం ముందు కేటీఆర్ జీరో అని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన ఒక చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నారని కేటీఆర్​ను ఉద్దేశించి అన్నారు. తన తండ్రి కేసీఆర్ (KCR)​ సీటిస్తే కేటీఆర్ డైరెక్ట్​గా ఎమ్మెల్యే అయ్యాడన్నారు. తాము ఎన్నో వ్యయప్రయాసలతో రాజకీయ నేతలం అయ్యామని జగ్గారెడ్డి పేర్కొన్నారు. తమ అనుభవాల ముందు కేటీఆర్​ జీరో అన్నారు.

    READ ALSO  MLA Anirudh | చంద్ర‌బాబు కోవ‌ర్టుల‌న్న‌ది కాంట్రాక్ట‌ర్ల గురించే.. నా మాట‌లు వ‌క్రీక‌రిస్తే స‌హించ‌బోనన్న ఎమ్మెల్యే అనిరుధ్‌

    Jagga Reddy | మీ మాటలను బట్టి స్పందన

    బీఆర్​ఎస్​ నేతల మాటలను బట్టి తమ స్పందన ఉంటుందని జగ్గారెడ్డి హెచ్చరించారు. సీఎంను గోకుడు ఎందుకు.. తన్నిపిచ్చుకోవడం ఎందుకు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్​రెడ్డిని చర్చకు పిలిచే స్థాయి కేటీఆర్​కు లేదని విమర్శించారు. తన తండ్రి సీటిస్తే ఎమ్మెల్యే అయిన కేటీఆర్​కు రాజకీయాల్లో కష్టానష్టాలు ఎలా తెలుస్తాయన్నారు.

    Jagga Reddy | నోరు తెరిస్తే అబద్ధాలే..

    కేటీఆర్​ నోరు తెరిస్తే అబద్ధాలే అని జగ్గారెడ్డి అన్నారు. పదేళ్లు అధికారం అనుభవించిన కేటీఆర్​ 18 నెలలు అధికారం లేకపోవడంతో ఒడ్డున పడ్డ చేపపిల్లల కొట్టుకుంటున్నారని పేర్కొన్నారు. ఐదేళ్లు పాలించాలని ప్రజలకు తమకు అవకాశం ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. బీఆర్​ఎస్​ నాయకులు తమను ఒక మాట అంటే పది మాటలు అంటామని హెచ్చరించారు. సీఎంను దూషించడం ఆపేస్తే, ప్రతి విమర్శలు ఆపేస్తామన్నారు.

    READ ALSO  Sri Ram Sagar | శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్​కు స్వల్ప ఇన్​ఫ్లో

    Latest articles

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    Nizamabad CP | విద్యాసంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad CP | విద్యా సంస్థలపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని...

    More like this