అక్షరటుడే, హైదరాబాద్: KTR : తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ktr జిమ్లో సోమవారం వర్క్ అవుట్ చేస్తూ గాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. నడుముకు గాయమైందంటూ ట్వీట్ చేశారు. వైద్యులు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని తెలిపారు. త్వరలో కోలుకుని ప్రజల ముందుకు వస్తానని కేటీఆర్ పోస్ట్ చేశారు.

కాగా, కేటీఆర్ గాయపడడంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. సోదరుడు కేటీఆర్ జిమ్లో వ్యాయామం చేస్తూ గాయపడ్డారని తెలిసింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా.. అంటూ పోస్ట్ చేశారు.
మరోవైపు వైఎస్సార్ సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా స్పందించారు. బ్రదర్ కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానంటూ పోస్టు చేశారు.
Wishing you a speedy recovery, brother. Get well soon! @KTRBRS
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 29, 2025