అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR | మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఐదు వేల మందికి కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. జులై 24న కేటీఆర్ పుట్టిన రోజు పురస్కరించుకొని గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో (Gift a Smile Program) భాగంగా మంగళవారం కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కిట్లు పంపిణీ చేయడం ఆపేసిందన్నారు.
KTR | మాతాశిశు మరణాలు తగ్గాయి..
గతంలో ప్రభుత్వ ఆస్పత్రులకు రావాలంటే ప్రజలు భయపడేవారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ కిట్ (KCR Kit) అమలు చేశాక.. ప్రసవాల కోసం చాలా మంది సర్కార్ దవాఖానాకు వచ్చారన్నారు. ఈ పథకంలో రాష్ట్రంలో మాతాశిశు మరణాలు తగ్గాయని తెలిపారు. అయితే కేసీఆర్ మీద కోపంతో ఈ పథకాన్ని ఆపేయడంతో బాలింతలు ఇబ్బంది పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. దీంతో ఈ ఏడాది 5 వేల కుటుంబాలకు కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
KTR | కేసీఆర్ కిట్ పథకం
బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో (Government Hospitals) ప్రసవించిన మహిళలకు కేసీఆర్ కిట్ అందించేవారు. ఇందులో చిన్నారులకు అవసరమైన సామగ్రి ఉండేది. ఇందులో శిశువు కోసం పౌడర్, నూనె, సబ్బులు, దుస్తులు, దోమతెర బాలింతకు చీరలు తదితర వస్తువులు ఉండేది. అంతేగాకుండా ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, అబ్బాయి పుడితే రూ.12 వేలు తల్లుల ఖాతాల్లో జమ చేసేవారు. అయితే బీఆర్ఎస్ హయాంలోనే డబ్బులు జమ చేయడం ఆపేశారు. కానీ కిట్లు పంపిణీ చేసేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కిట్లు ఇవ్వడం లేదు.