అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nagarjuna Sagar | తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన కర్ణాటకలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో కృష్ణానదికి (Krishna River) భారీగా వరద వస్తోంది. ఇప్పటికే జూరాల ప్రాజెక్ట్ నిండుకుండలా మారడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు.
దీంతో శ్రీశైలం జలాశయానికి(Srisailam Reservoir) ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లోకి 1,43,108 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. డ్యామ్ ఒక్క గేటును పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. దీంతో ఔట్‌ఫ్లో 94,709 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.80 అడుగుల నీరు ఉంది.
Nagarjuna Sagar | 260 టీఎంసీలు దాటిని సాగర్
శ్రీశైలం నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో నాగార్జున సాగర్(Nagarjuna Sagar)కు వరద వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లోకి 80 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. వర్షాలు పడుతుండటంతో సాయంత్రానికి ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా ప్రాజెక్ట్ నుంచి 7,531 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదు అవుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 261.59 టీఎంసీల నీరు ఉంది. మరో 50 టీఎంసీల నీరు వస్తే ప్రాజెక్ట్ నిండుకుండలా మారనుంది. ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో త్వరలోనే జలాశయం గేట్లు తెరిచే అవకాశం ఉంది.
Nagarjuna Sagar | గోదావరి ఉగ్రరూపం
భారీ వర్షాలతో దిగువన గోదావరి నది(Godavari River) ఉగ్రరూపం దాల్చింది. గోదావరి ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరుకు భారీగా వరద వస్తోంది. దీంతో 15 గేట్లు ఎత్తి 28,600 క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. గోదావరి వరద భారీగా రావడంతో పోలవరం ప్రాజెక్టులోకి 1.13 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఇచ్చిన నీటిని వచ్చినట్లు అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.
Nagarjuna Sagar | ఎగువన వెలవెల
గోదావరి కాళేశ్వరం వద్ద ఉప్పొంగి ప్రవహిస్తుండగా.. ఎగువన వరదలు లేక వెలవెలబోతుంది. ఉత్తర తెలంగాణలకు కీలకమైన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్(Sriram Sagar Project)లోకి ఇప్పటి వరకు భారీ వరద రాలేదు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లోకి 2,579 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 21.19 టీఎంసీల నీరు ఉంది. ప్రస్తుతం స్థానికంగా వర్షాలు పడుతుండటంతో ఇన్‌ఫ్లో స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.
Nagarjuna Sagar | ములుగు జిల్లాను ముంచెత్తిన వానలు
ములుగు జిల్లా(Mulugu District) వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి జిల్లా అతలాకుతలం అయింది. ములుగు జిల్లా వెంకటాపురంలో అత్యధికంగా 227 మి.మీ వర్షపాతం నమోదు కావడం గమనార్హం. మంగపేట, వాజేడు వెంకటాపురం మండలాల్లో భారీగా వర్షం(Heavy Rain) పడుతోంది. దీంతో జన జీవనం స్తంభించింది.