More
    Homeక్రీడలుIPL 2025 | మలుపు తిప్పిన సునీల్ నరైన్.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన కేకేఆర్!

    IPL 2025 | మలుపు తిప్పిన సునీల్ నరైన్.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన కేకేఆర్!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌(Kolkata Knight Riders)(కేకేఆర్) మరో విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals)తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన కేకేఆర్ 14 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇది కేకేఆర్‌కు నాలుగో విజయం. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో సునీల్ నరైన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కేకేఆర్ విజయానికి కలిసొచ్చింది.

    బ్యాటింగ్‌లో 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27 పరుగులు చేసిన నరైన్(Narine).. బౌలింగ్‌లో మూడు వికెట్లతో పాటు కీలకమైన కేఎల్ రాహుల్‌(KL Rahul)(7)ను రనౌట్ చేశాడు. అతని బౌలింగ్ ధాటికి క్రీజులో సెట్ అయిన ఫాఫ్ డుప్లెసిస్, అక్షర్ పటేల్‌‌(Axar Patel)తో పాటు డేంజరస్ ట్రిస్టన్ స్టబ్స్(1) ఔటయ్యారు. తన త్రీడీ(బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) ప్రదర్శనతో సునీల్ నరైన్(Sunil Narine).. ఢిల్లీ పతనాన్ని శాసించాడు.

    READ ALSO  WTC Final | నేడే టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్.. స‌ఫారీ జ‌ట్టు క‌ల‌ని నెర‌వేర్చుకుంటుందా..!

    ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్(KKR) నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 204 పరుగులు చేసింది. అంగ్‌క్రిష్ రఘువంశీ(32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44), రింకూ సింగ్(25 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 36) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్(3/43) మూడు వికెట్లు తీయగా.. విప్రజ్ నిగమ్(2/41), అక్షర్ పటేల్(2/27) రెండేసి వికెట్లు పడగొట్టారు.

    అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఫాఫ్ డుప్లెసిస్(45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62), అక్షర్ పటేల్(23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43) రాణించినా ఫలితం లేకపోయింది. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ(2/39) రెండు వికెట్లు పడగొట్టాడు. అనుకూల్ రాయ్, వైభవ్ అరోరా చెరో వికెట్ తీసారు.

    READ ALSO  IPL | ఆర్సీబీని ఐపీఎల్ అన్‌ఫాలో చేసిందా.. ఏడాది పాటు నిషేధం కూడానా?

    Latest articles

    Air India flight | ఎయిర్ ఇండియా ప్రయాణికులకు షాక్​.. టేకాఫ్​ అయ్యాక వెనక్కి మళ్లిన ఫ్లైట్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Air India flight : ఢిల్లీ నుంచి రాంచీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని...

    Navodaya schools | గుడ్​న్యూస్​.. ప్రారంభం కానున్న నవోదయ పాఠశాలలు

    అక్షరటుడే, హైదరాబాద్: Navodaya schools : తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ...

    Israel – Iran War | యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సెల్ అటాక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel - Iran War : ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు...

    Robert Vadra | మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ED సమన్లు.. ఆ రోజు విచారణకు రావాల్సిందే!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Robert Vadra : కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు(ఎంపీ) ప్రియాంక గాంధీ (Congress MP Priyanka Gandhi)...

    More like this