అక్షరటుడే, వెబ్‌డెస్క్: K- Ramp Glimpse | యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం “K-RAMP”పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా (Heroine Yukthi Thareja) కథానాయికగా నటిస్తుంది. జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రాజేశ్ దండ మరియు శివ బొమ్మక్ నిర్మిస్తున్నారు. మరియు హాస్య మూవీస్ – రుద్రాంశ్ సెల్యులోయిడ్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార కార్యక్రమాలకు మంచి స్పందన వచ్చింది. ఇటీవల కిరణ్ అబ్బవరం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై ఆకట్టుకోగా, తాజాగా సినిమా నుండి గ్లింప్స్ కూడా విడుదల కాగా, ఇది సినిమాపై మరింత అంచనాలు పెంచింది.
K- Ramp Glimpse | అంచనాలు పెంచిన గ్లింప్స్
కిరణ్ అబ్బవరం (Hero Kiran Abbavaram) బర్త్ డే సందర్భంగా విడుదలైన గ్లింప్స్‌లో మనోడి స్టైల్, పర్‌ఫార్మెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సారి మంచి హిట్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని అంటున్నారు. ఇక ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. కిరణ్ అబ్బవరం, చేతన్ భరద్వాజ్ కాంబినేషన్‌లో ఇది మూడో సినిమా. ముందుగా వీరి కాంబోలో “ఎస్ఆర్ కల్యాణ మండపం” మరియు “వినరో భాగ్యము విష్ణు కథ” వంటి సూపర్ హిట్లు వచ్చాయి. “K-RAMP” చిత్రం అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. కిరణ్ అబ్బవరం గతంలో మంచి విజయాలు సాధించినప్పటికీ, ఈ చిత్రం ప్రేక్షకులకు, అభిమానులకు మంచి జోష్ అందిస్తుందని అంటున్నారు.
“K-RAMP” వినోదాత్మకం గాను థ్రిల్లింగ్ గాను ఉంటుందన్న ప్రచారం నడుస్తుంది. కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా నటించడం, అలానే జీన్స్ నాని దర్శకత్వం(Jeans Nani Direction)లో చిత్రం రూపొందడం, ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైతే కానీ మూవీపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఏదైతేనేం K-RAMP సినిమాకు సంబంధించి అంచనాలు భారీగా పెరిగాయి, ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు మరింత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ‘రాజావారు రాణిగారు’ అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన కిరణ్ అబ్బవరం మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న కిరణ్ అబ్బవరం.. ఆ తరువాత ఏడాదికి నాలుగైదు సినిమాలు రిలీజ్ చేయడం మొదలుపెట్టాడు.