అక్షరటుడే, వెబ్‌డెస్క్ : New Ration Cards | రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల (New Ration Cards) పంపిణీకి సర్వం సిద్ధం అయింది.
పదేళ్లుగా రాష్ట్రంలో రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో లక్షలాది మంది కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయా అప్లికేషన్లను పరిశీలించిన అధికారులకు అర్హులకు కార్డులు మంజూరు చేశారు. వారికి ఫిజికల్ గా కార్డులను అందజేయాల్సి ఉంది.
కొత్త రేషన్ కార్డుల పంపిణీని సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించనున్నారు. సూర్యాపేట (Suryapeta District) జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రంలో కొత్త కార్డుల పంపిణీని ఆయన ప్రారంభిస్తారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేస్తారు. మిగతా జిల్లాల్లో కూడా ప్రజాప్రతినిధులు కొత్త కార్డులను పంపిణీ చేయనున్నారు.
కొత్తగా 3 లక్షల 54 వేల రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. సోమవారం కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాటు మాటలతో కాలయాపన చేసిందని ఆయన విమర్శించారు. తాము మాత్రం చిత్తశుద్ధితో రేషన్ కార్డులు జారీ చేస్తున్నట్లు తెలిపారు.
అలాగే నాలుగు విడుతల్లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. తొమ్మిది రోజుల్లోనే రూ.9వేల కోట్లు రైతు భరోసా రైతుల ఖాతాలో జమ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తమది పేదల ప్రభుత్వమని మంత్రి పేర్కొన్నారు.