అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల పథకం Indiramma Housing Schemeపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి Ponguleti Srinivas Reddy కీలక ప్రకటన చేశారు. 400 చదరపు అడుగులకు తగ్గకుండా, 600 చదరపు అడుగులకు మించకుండా నిర్మించుకున్న ఇళ్లకు డబ్బులు మంజూరు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేదల కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.
Indiramma Houses | యాప్ ద్వారా సర్వే..
లబ్ధిదారుల ఎంపిక కోసం యాప్ ద్వారా ప్రభుత్వం సర్వే Survey చేపట్టింది. అయితే ఇంకా పూర్తి స్థాయిలో లబ్ధిదారులను ఎంపిక చేయలేదు. కానీ పలు గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్ట్ కింద ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఇలా బేస్మెంట్ వరకు basement level ఇల్లు కట్టుకున్న పలువురికి ప్రభుత్వం ఇటీవల రూ.లక్ష చొప్పున బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి CM Revanth Reddy పలువురు లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
Indiramma Houses | లబ్ధిదారులను ఎంపిక చేయాలి
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి Indiramma Housing Scheme లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. అలాగే ఇళ్లు కట్టుకుంటున్న వారికి నిర్మాణాన్ని బట్టి ప్రతి సోమవారం every Monday ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. 200 దరఖాస్తులకు ఒక గెజిట్ అధికారిని నియమించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించారు. అనర్హులు ఎంపికైతే సదరు అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. కాగా ఇళ్ల నిర్మాణాల పురొగతిని పరిశీలిస్తూ ప్రతి సోమవారం లబ్ధిదారులకు డబ్బులు జమ చేయాలని మంత్రి చెప్పడంతో ఇళ్లు నిర్మించుకుంటున్న వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.