అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indiramma Houses | ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం చేపట్టిన విషయం తెలిసిందే. తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించారు. ఇప్పటికే గ్రామాల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. పలు చోట్ల ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. అయితే జనవరి 26న సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఈ పథకాన్ని ప్రారంభించారు. అప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద మండలానికి ఒక గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. పలువురి ఇళ్ల నిర్మాణం కూడా పూర్తయింది. ఈ క్రమంలో జూన్ 2న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించాలని ప్రభుత్వం(Government) భావిస్తోంది.
Indiramma Houses | రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా..
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం(State Formation Day) సందర్భంగా జూన్ 2న మండలానికి ఒక ఇంట్లో గృహ ప్రవేశం చేయించాలని చూస్తున్నారు. ఈ మేరకు అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. స్లాబ్ పూర్తయిన ఇళ్లలో మిగతా పనులు జూన్ 2లోగా కంప్లిట్ అయ్యేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది.
Indiramma Houses | ఇళ్ల నిర్మాణ వివరాలు..
ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇందులో 20 వేల ఇళ్ల నిర్మాణం ప్రారంభం అయ్యాయి. 5,200 ఇళ్ల పనులు బేస్మెంట్ వరకు, 300 ఇళ్లు గోడలు పూర్తయ్యి స్లాబ్ వేయడానికి రెడీ అవుతున్నాయి. మరో 200 ఇళ్లు స్లాబ్ కూడా పూర్తి కావడంతో ప్లాస్టరింగ్ తదితర పనులు చేపడుతున్నారు. ఇప్పటికే అధికారులు ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ. 53.64 కోట్లను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల(Indiramma Houses) అకౌంట్లలో ప్రభుత్వం జమ చేసింది.
Indiramma Houses | హైదరాబాద్‌లో టవర్లు..
జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలో ఇళ్లు లేని పేదలు లక్షల సంఖ్యలో ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 10,66,953 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరిలో కొంత మందికి మాత్రమే సొంత స్థలం ఉంది. మిగతా వారికి ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరికి బహుల అంతస్తుల్లో నిర్మాణాలు చేపట్టి ఇళ్లు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. సర్కారు భూముల్లో జీ ప్లస్ 3 ఫ్లోర్లతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది. ఎకరం విస్తీర్ణంలో 300 ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నారు. షేక్‌పేట (ఖైరతాబాద్), హిమాయత్ నగర్ (ముషీరాబాద్), సైదాబాద్ (యాకుత్ పుర, మలక్ పేట) ఆసిఫ్ నగర్ (కార్వాన్, గోషామహాల్, నాంపల్లి) మారేడ్‌పల్లి (సికింద్రాబాద్), తిరుమలగిరి (కంటోన్మెంట్), బండ్లగూడ (చాంద్రాయణగుట్ట) ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించనున్నారు.